Published On:

MLA Sujana Chowdary: ఏపీ బీజేపీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు.. సర్జరీ కోసం లండన్‌ నుంచి హైదరాబాద్‌కు..!

MLA Sujana Chowdary: ఏపీ బీజేపీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు.. సర్జరీ కోసం లండన్‌ నుంచి హైదరాబాద్‌కు..!

AP BJP MLA Sujana Chowdary Ijury In Lonodn Tour: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయాలయ్యాయి. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఓ సూపర్ మార్కెట్ వద్ద కాలు జారడంతో కిందపడ్డాడు. ఈ ఘటనలో ఆయన కుడి చేతి భాగంలో ఎముక విరిగింది. వెంటనే ఆక్కడ స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు.

 

ఈ మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకొచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే సర్జరీ చేసుకునేందుకు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని , ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

 

లండన్ నుంచి బయలుదేరిన సుజనా చౌదరి.. తెల్లవారుజామున హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడినుంచి నేరుగా బేగంపేట్‌లో ఉన్న కిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

 

కాగా, ఆయనకు తీవ్ర గాయాలైనట్లు తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే సుజనా హెల్త్ అప్ డేట్ కోసమని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే మే 2న మోదీ ఏపీలో పర్యటించారు. ఈ సమయంలో ఆయన విజయవాడలోనే ఉన్నారు. స్వయంగా మోదీకి స్వాగతం కూడా ఆయన పలికారు. ఈ పర్యటన తర్వాతనే లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది.

 

ఇదిలా ఉండగా, సుజనా చౌదరి తొలుత టీడీపీలో రెండు సార్లు రాజ్యసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మోదీ తొలి క్యాబినెట్‌లో కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. పలు కారణాలతో ఆయన టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ షేక్‌పై 47వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.