KKR Vs CSK: కోల్ కతాకు చావోరేవో.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక

IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సొంతగడ్డపై కోల్ కతా రాణించారు. అలాగే ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఆ జట్టు మిగతా రెండు మ్యాచ్ ల్లోనూ తప్పకుండా గెలవాలి.
నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడిన కోల్ కతా జట్టు 5 మ్యాచ్ లు గెలవగా, మరో మ్యాచ్ రద్దైంది. దీంతో 11 పాయింట్లతో 6 స్థానంలో ఉంది. మరోవైపు 11 మ్యాచ్ లు ఆడిన చైన్నై జట్టు కేవలం 2 మ్యాచ్ ల్లోనే విజయం సాధించి ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి వైదొలిగింది. పాయింట్ల టేబుల్ లో చివరి స్థానంలో ఉంది. కాగా పరువు కాపాడుకునేందుకైనా చెన్నై ఈ మ్యాచ్ లో గెలవాలని చూస్తోంది.
కోల్ కతా నైట్ రైడర్స్: రహ్మనుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్ క్రిష్ రఘువంశీ, మనీశ్ పాండే, రింకు సింగ్, మొయిన్ అలీ, రమణ్ దీప్ సింగ్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి
చెన్నై సూపర్ కింగ్స్: ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్, డేవాన్ కాన్వే, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, రవిచంద్రన్ అశ్విన్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీశా పతిరన.