Published On:

Terror Attack in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో మరో ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులు

Terror Attack in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో మరో ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులు

Terror Attack in Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌ పహల్గామ్ ఉగ్రదాడి ఘటన మరువముందే టెర్రరిస్టులు మరో రెచ్చిపోయారు. ఈ మేరకు ఉగ్రదాడికి పాల్పడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఓ సామాజిక యాక్టివిస్ట్‌ ఇంటిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన గాయపడ్డారు.

 

వివరాల ప్రకారం.. కుప్వారా ప్రాంతంలో సోషల్ యాక్టివిస్ట్‌గా 45 ఏళ్ల రసూల్ మాగ్రే నివసిస్తున్నాడు. అయితే ఒక్కసారిగా ఆయన ఇంటిపై ఎవరూ లేని సమయంలో కాల్పులు జరిపారు. టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో రసూల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

కాల్పులు జరిగినట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఆయనపై టెర్రరిస్టులు దాడికి ఎందుకు పాల్పడ్డారనే విషయం తెలియరాలేదు. ప్రస్తుతం టార్గెట్ చేసేందుకు గల కారణాలపై భద్రతా దళాలు ఆరా తీస్తున్నారు. మరికాసేపట్లో దీనికి సంబంధించిన విషయాలు బయటకు రానున్నాయి. ఇదిలా ఉండగా, పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది టూరిస్టులు చనిపోయిన సంగతి తెలిసిందే.

 

ఇదిలా ఉండగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ సరిహద్దులో పొరపాటున జీరో లైన్ దాటిన బీఎస్ఎఫ్ జవాన్‌ను పాకిస్థాన్ రేంజర్లు బంధించిన సంగతి తెలిసిందే. అయితే, పాకిస్థాన్ రేంజర్లకు చిక్కిన ఈ బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణంకుమార్ షా విడుదలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గడిచిన మూడు రోజులుగా పాకిస్థాన్ అధికారులతో మూడు సార్లు చర్చలు జరిపిన ఫలితం లేకుండా పోయింది. అతడి ఆచూకీ తమకు కూడా తెలియదని అక్కడి అధికారులు బకాయిస్తున్నారు. అయితే, మరోసారి చర్చలు నిర్వహించేందుకు బీఎస్ఎఫ్ ప్రతిపాదించింది. దీనిపై ఎలాంటి వివరణ వస్తుందో చూడాలి మరి.