Aparadhi: ఓటీటీకి వస్తున్న మరో హర్రర్ మూవీ.. ఫ్యాన్స్ ఫిదా అవ్వడం ఖాయం

Aparadhi: ఈమధ్య సినిమాలు థియేటర్ లో కన్నా ఓటీటీలోనే ఎక్కువ వస్తున్నాయి. హిట్స్ అవుతున్నాయి. థియేటర్ లో ప్లాప్ అయిన సినిమాలు ఓటీటీలో హిట్ అవుతున్నాయి. ఇంకోపక్క వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగు ప్రేక్షకుల కోసం ఓటీటీకి డబ్బింగ్ తో తీసుకొస్తున్నారు మేకర్స్. కొత్త సినిమాలనే కాకుండా పాత సినిమాలకు కూడా డబ్బింగ్ చేసి దింపుతున్నారు.
అలా పాత సినిమాలను తెలుగులోకి తీసుకొస్తున్న ఓటీటీ ఆహా. ప్రతి శుక్రవారం ఏదో ఒక కొత్త సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నారు. కొత్త సినిమా లేకపోతే డబ్బింగ్ సినిమాలను అయినా రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఇరుళ్ అనే సినిమాను తెలుగులో అపరాధి అనే పేరుతో ఆహా రిలీజ్ చేస్తుంది. మలయాళ స్టార్ హీరోస్ ఫహద్ ఫాజిల్, సౌబిన్ సాహిర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు నసీఫ్ యూసఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించాడు.
ఇక ఈ సినిమాలో దర్శన్ రాజేంద్రన్ హీరోయిన్ గా నటించింది. 2021 లో రిలీజ్ అయినా ఈ హార్రర్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు 4 ఏళ్ల తర్వాత ఈ సినిమా తెలుగులో అపరాధి పేరుతో మే 8 న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
అలెక్స్ (సౌబిన్ సాహిర్), అర్చన(దర్శన) లవర్స్. ఒకరోజు వీరిద్దరూ షికారుకు వెళ్తుంటే కారు ఆగిపోతుంది. వారికి ఉన్ని(ఫహద్ ఫాజిల్) ఆశ్రయం ఇస్తాడు. అయితే అక్కడకు వెళ్ళాక కొన్ని అనుకొని సంఘటనలు వారికి ఎదురవుతాయి. అర్చనకు అలెక్స్ గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. అసలు అలెక్స్ ఎవరు..? ఉన్ని ఎవరు..? ఆ ఇంట్లో y జరిగింది..? అనేది కథ. ఎంతో ఉత్కంఠ రేపే ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.