Vivo T3 Ultra Price Drops: వారెవ్వా ఆఫర్ అదిరిందిగా.. భారీగా తగ్గిన Vivo T3 Ultra ధర.. అదనంగా మరెన్నో డీల్స్..!

Vivo T3 Ultra Price Drops: టెక్ బ్రాండ్ వివో సెప్టెంబర్ 2024లో భారతదేశంలో మీడియాటెక్ డైమెన్సిటీ, 5,500mAh బ్యాటరీతో Vivo T3 Ultraని లాంచ్ చేసింది. ఆ సమయంలో హ్యాండ్సెట్ బేస్ 8GB + 128GB ఆప్షన్ ధర రూ.31,999 నుండి ప్రారంభమైంది. జనవరిలో ధర రూ.2,000 తగ్గింది. ఇప్పుడు, కంపెనీ మళ్లీ హ్యాండ్సెట్ ధరను రూ. 2,000 తగ్గించింది. బేస్ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ రూ. 27,999 కు అమ్మకానికి అందుబాటులో ఉంది. కొత్త ధరలు ఈరోజు అంటే మే 1 నుండి అమలులోకి వస్తాయి.
Vivo T3 Ultra Offers
భారతదేశంలో Vivo T3 అల్ట్రా ధర ఇప్పుడు 8GB + 128GB మోడల్‌కు రూ.27,999 నుండి ప్రారంభమవుతుంది. కాగా, 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్లు వరుసగా రూ.29,999, రూ.31,999 కు అందుబాటులో ఉన్నాయి. కొత్త ధరలు ఈరోజు అంటే మే 1 నుండి దేశంలో అమలులోకి వస్తాయి. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల ద్వారా గ్రీన్, గ్రే షేడ్స్‌లో లభిస్తుంది.
జనవరిలో Vivo T3 అల్ట్రా ధర లాంచ్ ధర కంటే రూ. 2,000 తక్కువగా ఉంటుందని వివో ప్రకటించింది. లాంచ్ సమయంలో ఈ హ్యాండ్సెట్ ధరలు 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB వెర్షన్లకు వరుసగా రూ. 31,999, రూ. 33,999, రూ. 35,999గా ఉన్నాయి.
Vivo T3 Ultra Features
వివో T3 అల్ట్రాలో 6.78-అంగుళాల 1.5K (1,260×2,800 పిక్సెల్స్) కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్కి సపోర్ట్ ఇస్తుంది. ఇది 4ఎన్ఎమ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్తో పనిచేస్తుంది, 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉన్నాయి. మొబైల్ ఆండ్రాయిడ్ 14-ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 14 పై నడుస్తుంది.
వివో T3 అల్ట్రాలో ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది, ఇందులో ఆటోఫోకస్, OIS సపోర్ట్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ సోనీ IMX921 ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ షూటర్ ఉన్నాయి. ముందు కెమెరాలో సెల్ఫీలు, వీడియో కాల్ల కోసం ఆటో ఫోకస్ సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.
వివో T3 అల్ట్రాలో 5,500mAh బ్యాటరీ ఉంది. ఇది 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ ఫీచర్ అందిస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ 5.3, 5G, GPS, FM రేడియో, Wi-F, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- Amazon Great Summer Sale 2025: భారీ డిస్కౌంట్స్.. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేస్తోంది.. బెస్ట్ డీల్స్ ఇవే..!