Angry Cobra Video: వీడియో తీస్తున్న వారిపై బుసలు కొట్టిన నాగు పాము.. చూస్తే హడలెత్తిపోవాల్సిందే

Cobra Attacks on while Captured in Camera: ఇండియాలో ప్రసిద్ధి చెందిన పాముల్లో నాగుపాము ఒకటి. ఇది చాలా విషపూరితమైన సర్పజాతలకు సంబంధించింది. భారతదేశం సాంస్కృతిలో నాగుపామును దేవతగా కొలుస్తారు. అందుకే ఇండియాలో నాగుపాముకు ప్రాధాన్యత ఇస్తారు. నాగుపాములు ఒక మీటరు నుంచి రెండు మీటర్ల పొడుగు ఉంటాయి. ప్రాంతాలను బట్టి పాములు రంగులను కలిగి ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో గోధుమ రంగును కలిగి ఉంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో నలుపు, పసుపు రంగులో కనిపిస్తుంటాయి. కొన్ని చోట్ల బూడిద రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి.
అన్ని పాముల కంటే నాగుపాము పెద్ద పడగలను కలిగి ఉంటాయి. ఆగ్రహానికి గురైనప్పుడు పడగలను చాచి ఇతర జంతువులపై దాడి చేస్తాయి. ఎక్కువగా అడవులతోపాటు గడ్డి భూములు చిత్తడి నేలల్లో జీవనం కొనసాగిస్తాయి. ఇవి ఎక్కువగా నీటిలో ఈదుతాయి. ఉండటానికి గూళ్లను నిర్మించుకుంటాయి. ఈ పాముల ప్రవర్తన అన్ని పాముల కంటే భిన్నంగా ఉంటాయి.
సాధారణంగా నాగుపాములు అడవిలో ఆహారం లభించకపోతే పరిసర ప్రాంతాల్లోకి వెళ్లాయి. కొన్ని పాములు అడవిలో నుంచి గ్రామాల్లోకి వచ్చి జనాలపై దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది స్నేక్ క్యాచర్స్ పట్టుకొని అడవి ప్రాంతాల్లో వదిలేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా నాగుపాముకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోను ఓ నెటిజెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరికొంతమంది కామెంట్లు కూడా చేశారు. వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఓ భారీ కింగ్ కోబ్రా వీడియో తీస్తున్న వారిపై దాడి చేయడం చేస్తుంది. నాగు పాము పెద్ద పడగలను కలిగి ఉంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన ప్రతిఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.