Published On:

Nandini Gupta : హైదరాబాదీ బిర్యానీ అద్భుతం : మిస్‌ ఇండియా నందిని గుప్తా

Nandini Gupta : హైదరాబాదీ బిర్యానీ అద్భుతం : మిస్‌ ఇండియా నందిని గుప్తా

Nandini Gupta : తెలంగాణ గురించి మాట్లాడిన ప్రతిసారి తనకు గొప్ప అనుభూతి కలుగుతుందని మిస్‌ ఇండియా నందిని గుప్తా అన్నారు. తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి ఎంతో గొప్పగా ఉంటాయని కొనియాడారు. హైదరాబాద్‌ నగరం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు ప్రేమను పంచుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాదీ బిర్యానీ నుంచి ఇరానీ చాయ్‌ వరకు ఆహారం అద్భుతంగా ఉంటుందన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి యువతి ఒక గొప్ప లక్ష్యంతో ముందడుగు వేస్తున్నారని చెప్పారు. మరోవైపు ప్రపంచ సుందరి పోటీలకు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. పోటీల్లో పాల్గొనేందుకు అందాల భామలు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. వందకు పైగా దేశాల నుంచి వచ్చే సుందరీమణులకు స్వాగతం పలికేందుకు శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో ఏర్పాట్లు చేశారు.

 

ప్రపంచ సుందరి పోటీలు తెలంగాణకు గర్వకారణం : మంత్రి జూపల్లి
తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలు జరగడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పోటీల కోసం వస్తున్న ప్రతిఒక్కరికీ గొప్ప అనుభూతిని పంచేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మిస్‌ వరల్డ్‌ గ్లోబల్‌ యూనిట్‌‌కు వేదిక అన్నారు. మన రాష్ట్ర సంప్రదాయం, పర్యాటక ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటేందుకు ఇదో చక్కని అవకాశంగా చెప్పారు.

 

సామాన్యూలకు కూడా అవకాశం..
పర్యాటకశాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మాట్లాడారు. తెలంగాణ ఆహారం, సంస్కృతి, పర్యాటకాన్ని ప్రపంచానికి చాటేందుకు ప్రపంచ సుందరి పోటీలు దోహదం చేయనున్నాయని తెలిపారు. విదేశీ పర్యాటకులను ఆకట్టుకొనేందుకు ఇదో మంచి అవకాశం అన్నారు. పోటీలను విజయవంతం చేయాలని కోరారు. వీవీఐపీల కోసం అందాల పోటీలు అనే అభిప్రాయం లేకుండా సామాన్యులు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీలను తిలకించాలనే ఆసక్తి ఉన్నవారు పర్యాటక శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి: