Published On:

India: అమృత్‌సర్ లో పాక్ గూఢాచారులు అరెస్ట్!

India: అమృత్‌సర్ లో పాక్ గూఢాచారులు అరెస్ట్!

భారత సైనిక రహస్యాలను లీక్ చేసిన ఇద్దరిని అమృత్‌సర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పాకిస్థాన్ గూఢచారులుగా గుర్తించారు. భారత సైనిక సమాచారాన్ని పాక్ కు చేరవేస్తున్నారు. భద్రతా బలగాలు వీరిని విచారిస్తున్నాయి. మరోవైపు భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ ధళాలధిపతులతో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరకుపైగా పరిస్థితులను పర్యవేక్షించారు.

 

భారత్ కు చెందిన ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాల యొక్క సమాచారాన్ని పాకిస్థాన్ కు చేరవేస్తూ దొరికిపోయారు. వారిని పాలక్ షేర్ మాసిహ్, సూరజ్ మాసిహ్‌లుగా గుర్తించారు. వీరికి పాకిస్థాన్ నిఘా కార్యకర్తలతో సంబంధాలు కలిగి ఉన్నారని సమాచారం.

 

 

ఈనెల 3వతేదీన ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించాయి భద్రతాబలగాలు. వీరిని విచారించిన అనంతరం ప్రస్తుతం అమృత్‌సర్ సెంట్రల్ జైలులో ఉన్న పిట్టు అలియాస్ హ్యాపీ అలియాస్ హర్‌ప్రీత్ సింగ్ కథ నడిపిస్తున్నాడని తెలుసుకున్నారు. వీరు భారత ఆర్మీకి చెందిన విలువైన రహస్యాలను పాకిస్థాన్ కు చేరవేస్తున్నారు. అయితే వీరిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు.

 

పహల్గాంలో జరిగిన దాడిలో 28మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. భారత్ ఇప్పటికే పాకిస్థాన్ ను ఆర్థికంగా కట్టడి చేస్తోంది. సింధూ జలాలను నిలిపివేయడంతో పాటు పాక్ నుంచి దిగుమతులను నిషేదించింది. అయితే పాకిస్థాన్ ఆర్థికంగా ఇప్పటికే చితికి పోయింది. యుద్ధట్యాంకులలో డీజిల్ కూడా నింపుకోలేని స్థితిలో ఉంది. గట్టిగా నాలుగు రోజులు పోరాడలేని స్థితిలో పాక్ ఉందని ఆ దేశ మాజీ సౌన్యధికారి బజ్వా తెలిపారు.