Published On:

PM Modi : భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం : ప్రధాని మోదీ ప్రకటన

PM Modi : భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం : ప్రధాని మోదీ ప్రకటన

Prime Minister Narendra Modi : భారత సాయుధ దళాల సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో భారత సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం దాడి అనంతరం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంగా ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

 

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో మంగళవారం కీలక సమావేశం జరిగింది. గంటన్నరపాటు సాగిన భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అనిల్‌ చౌహాన్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డొభాల్‌, త్రివిధ దళాల అధిపతులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

దేశంలో అంతర్గత భద్రతతోపాటు సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చించారు. ఉగ్రవాదాన్ని అణచివేయడం జాతీయ సంకల్పమని ప్రధాని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో దృఢనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. పహల్గాం దాడికి దీటైన బదులిస్తామని తెలిపారు. కార్యాచరణ రూపొందించుకోవడంలో ఇండియా సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని చెప్పారు. ఎప్పుడు ఎలా స్పందించాలో సైన్యమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

 

ఇవి కూడా చదవండి: