Home / Indian Army
Force Gurkha: ఫోర్స్ మోటార్స్ లిమిటెడ్ ఇండియన్ ఆర్మీ నుండి భారీ ఆర్డర్‌ను పొందింది. 2,978 యూనిట్ల ‘ఫోర్స్ గూర్ఖా’ లైట్ వెహికల్ (GS 4X4 800 కిలోల సాఫ్ట్ టాప్) సరఫరా చేసేందుకు కంపెనీ ఒప్పందం చేసుకుంది. గరిష్ఠంగా మూడేళ్ల వ్యవధిలో దశలవారీగా ఈ గూర్ఖా నమూనాలను సైన్యానికి అందజేస్తారు. కొత్త ఫోర్స్ గూర్ఖా వాహనాన్ని ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉపయోగించనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి, భారత సైన్యానికి ఏ మోడల్ ‘ఫోర్స్ గూర్ఖా’ పంపిణీ చేస్తుందనే […]
కెప్టెన్ ఫాతిమా వాసిమ్ సియాచిన్ గ్లేసియర్‌లో ఆపరేషనల్ పోస్ట్‌లో నియమించబడిన మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్‌గా రికార్డు సృష్టించారు. సియాచిన్ యుద్ధ పాఠశాలలో కఠినమైన శిక్షణ పొందిన తరువాత, ఆమె 15,200 అడుగుల ఎత్తులో ఉన్న ఆపరేషనల్ పోస్టులో నియమిలయ్యారు.
టయోటా కిర్లోస్కర్ మోటార్ నుండి హిలక్స్ పికప్ ట్రక్ యొక్క మొదటి బ్యాచ్ వాహనాలనును ఇండియన్ ఆర్మీ అందుకుంది. ఈ వాహనాలను ఫ్లీట్లోకి చేర్చాలని నిర్ణయించే ముందు ఈ వాహనాన్ని భారత సైన్యం యొక్క టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ యొక్క నార్తర్న్ కమాండ్ రెండు నెలల కఠినమైన పరీక్షలు నిర్వహించింది.
ఇండియన్ ఆర్మీ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV యొక్క 1,850 యూనిట్లను ఆర్డర్ ఇచ్చింది. సైన్యం ఆర్డర్ చేసిన స్కార్పియో క్లాసిక్ SUVలలో ఇది రెండవది. దీనికి ముందు, సైన్యం ఈ ఏడాది జనవరిలో క్లాసిక్ యొక్క 1,470 యూనిట్లను ఆర్డర్ చేసింది.
త్రివిద దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’స్కీమ్ లో భాగంగా నిర్వహించిన అగ్నివీరుల నియామక రాత పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఈ ఫలితాలను విడుదల చేసింది.
ఈ ఆర్థిక సంవత్సరం నుండి సైనికులకు రేషన్‌లో తృణధాన్యాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సైనికులు తీసుకునే ఆహారం జీవన శైలి వ్యాధులను అరికట్టేవిధంగా మన భౌగోళిక వాతావరణ పరిస్దితులకు సరిపడే విధంగా ఉండాలని భావించారు.
గత ఏడాది నుంచి భారత సైన్యంలో 7,000కు పైగా ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనిరక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలిపారు.
భారత సైన్యం మహిళా అధికారులను వారి పురుషులతో సమానంగా తీసుకురావడానికి లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి నుండి కల్నల్ స్థాయికి ప్రమోషన్ కోసం ప్రత్యేక ఎంపిక బోర్డు (SSB)ని నిర్వహిస్తోంది.
నార్త్ సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జెమా సమీపంలో ఆర్మీ ట్రక్కు మలుపు తిరుగుతూ లోయలోకి పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 16 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో ఎల్ఏసి వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు వచ్చిన వార్తలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేసాయి.