Sitara Ghattamaneni: మహేష్ కూతురా.. మజాకానా.. వైట్ లెహంగాలో దేవతలా ఉంది మావా

సితార ఘట్టమనేని.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు.

సూపర్ స్టార్ మహేష్ బాబు- నమ్రత శిరోద్కర్ ల ముద్దుల తనయగా సితారకు మంచి గుర్తింపు ఉంది.

sఇతర పుట్టినప్పటి నుంచే సెలబ్రిటీగా మారింది. ఇక పెరిగేకొద్దీ నమ్రత.. కూతురును కూడా సెలబ్రిటీగా మార్చేసింది.

చిన్నప్పటి నుంచే సీతూ పాప యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అంటూ నిత్యం సోషల్ మీడియాలోనే కనిపిస్తూ ఉండేది.

ఇక కొద్దిగా పెరిగాకా.. తండ్రితో కలిసి షోస్ లో కనిపిస్తూ మరింత గుర్తింపు తెచ్చుకుంది.

ఇక అతి చిన్న వయస్సులోనే ఇంటర్నేషనల్ జ్యూవెలరీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది.

నిత్యం సోషల్ మీడియాలో తన ఫొటోస్ ను షేర్ చేసే సితార .. తాజాగా కొత్త ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

వైట్ కలర్ లెహంగా.. దాని మీద గ్రీన్ జ్యూవెలరీ ధరించి అందాల అప్సరసలా మెరిసిపోయింది. పై నుంచి దిగివచ్చిన దేవతలా ఉందని మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.