Amith Shah: పాక్ పౌరులను వెనక్కి పంపాలని సీఎంలకు అమిత్ షా ఫోన్.. హైదరాబాద్‌లో 208 మంది!

Amit Shah orders to CMs Identify all Pakistan nationals: పహల్గామ్ ఉగ్రదాడిని యావత్తు ప్రపంచం ఖండిస్తోంది. ఈ ఉగ్రదాడిలో 28మంది చనిపోయారు. ఇప్పటికే ఈ విషయంపై భారత్ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే పాకిస్థానీయుల వీసా రద్దు తదితర అంశాలపై నిర్ణయం తీసుకుంది. తాజాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ మేరకు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పాకిస్థానీయులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే హైదరాబాద్‌లో 208 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పాక్ పౌరుల వివరాలను హైదరాబాద్ పోలీసులు సేకరించారు. రెండు రోజుల్లో పాక్ పౌరులు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇప్పటికే పాకిస్థాన్ పౌరులకు జారీ చేసిన వీసా సేవలను భారత్ నిలిపివేయడంతో పాటు ఈ నెల 27 వరకు అన్ని వీసాలు రద్దు కానున్నాయని తెలిపింది. అయితే వీసాల గడువు ముగిసేలోగా పార్ పౌరులు భారత్ వీడాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.