Published On:

Coolie In 100 Days: కౌంట్ డౌన్ మొదలు.. దళపతి సూర్యను గుర్తుచేసిన లోకేష్

Coolie In 100 Days: కౌంట్ డౌన్ మొదలు.. దళపతి సూర్యను గుర్తుచేసిన లోకేష్

Coolie In 100 Days: సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న తాజా చిత్రం కూలీ. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ తో పాటు.. చాలామంది స్టార్స్ నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్, సత్యరాజ్, శృతి హాసన్ ఇలా స్టార్స్ మొత్తాన్ని రంగంలోకి దింపాడు లోకేష్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

రజినీ సినిమా అంటే అనిరుధ్ కి పూనకాలు వచ్చేస్తాయో ఏమో తెలియదు కానీ.. మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇక ఈ సినిమా ఆగస్టు 14 న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక అదే రోజున ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 కూడా రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాలకు పోటీ మాత్రం గట్టిగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక వార్ 2 తో గెలవాలి అంటే. ప్రమోషన్స్ గట్టిగా ఉండాలి అనుకున్నారో ఏమో మేకర్స్.. 100 రోజుల నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు.

 

కూలీ ఇంకా 100 రోజులు మాత్రమే అనే పేరుతో కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో స్టార్ హీరోలందరి ఫేస్ లను రివీల్ చేయకుండా బ్యాక్ నుంచి చూపిస్తూ.. చివర్లో రజినీ లుక్ ను రివీల్ చేశారు. ఇక ఈ వీడియోకు అనిరుధ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక చివర్లో రజినీ బ్యాక్ చూపిస్తూ.. అలా వెనక్కి తిరిగే షాట్ తో వీడియోను ఎండ్ చేశారు. ఈ బ్యాక్ షాట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రజినీ బ్యాక్ షాట్స్ ఎప్పుడు  సెన్సేషన్ సృష్టిస్తూ ఉంటాయి.

 

దాదాపు 14 ఏళ్ళ క్రితం రజినీ నటించిన దళపతి సినిమా గుర్తిందిగా. అందులో సూర్య పాత్రలో రజినీ నటనను ఏ ప్రేక్షకుడు అంత సామాన్యంగా మర్చిపోడు. అందులో సూర్య.. బాధలో ఉన్నప్పుడు సముద్రం ఒడ్డున నిలబడి.. శ్వాస తీసుకొని వెనక్కి తిరుగుతాడు. ఇప్పుడు కూలీలో కూడా అదే కెమెరా యాంగిల్ లో రజినీని చూపించాడు లోకేష్. ఇప్పుడు ఆ రెండు ఫ్రేమ్స్ ను పక్క పక్కన పెట్టి ఫ్యాన్స్.. అప్పుడు ఇప్పుడు రజినీ స్టైల్ అలానే ఉందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో రజినీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.