Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో జైళ్లపై ఉగ్రదాడికి కుట్ర.. 5 ఐఈడీలు స్వాధీనం

Terror Strike attempt chance In Jammu and srinagar jails: జమ్మూకశ్మీర్‌లో అధికారులు హైఅలర్ట్ జారీ చేశారు. ఐదు ఐఈడీలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీనగర్, జమ్ములోని జైళ్ల లక్ష్యమని వార్నింగ్ ఇచ్చింది. కాగా, జమ్మూకశ్మీర్ జైళ్లలో హైప్రొఫైల్ ఉగ్రవాదులు ఉన్నారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్ సభ్యులు ఉన్నారు. ఈ మేరకు జమ్ముకశ్మీర్, శ్రీనగర్ జైళ్లలో భద్రత పెంచారు.
కాగా, పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. ఉగ్రవాద సహచరులు నిసార్ , ముష్తాక్‌ను ఎన్ఐఏ విచారించింది. ఆర్మీ వాహనం దాడి కేసులో నిస్సార్, ముష్తాక్ అరెస్టయ్యారు. అలాగే జైళ్ల భద్రతపై ఉన్నతాధికారులతో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ సమీక్ష నిర్వహించారు. 2023 నుంచి జైళ్ల భద్రతను సీఐఎస్ఎఫ్ పర్యవేక్షిస్తుంది.
జమ్మూ కశ్మీర్లోని జైళ్ల భద్రత సీఐఎస్ఎఫ్ పర్యవేక్షణలో ఉంటుంది. కాగా, పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులు సౌత్ కశ్మీర్ అడవుల్లో ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అడవులను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే దాడిన జరిగిన ప్రాంతం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల వరకు సెర్చ్ ఆపరేషన్ పూర్తి చేశాయి. ఉగ్రవాదుల జాడ కోసం డ్రోన్లు, హెలికాప్టర్లు ఉపయోగిస్తుంది.
ఇదిలా ఉండగా, జమ్మూకశ్మీర్‌లో ఓ ఉగ్రవాద స్థావరాన్ని భద్రత బలగాలు గుర్తించాయి. పూంచ్ జిల్లాలో ఇవాళ కమ్యూనికేషన్ పరికరాలతో పాటు 5 ఐఈడీలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఈ స్థావంర సురాన్ కోట్ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో మరింత అప్రమత్తమయ్యారు.