Tamil Nadu Rains: దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం
తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాల నేపధ్యంలో నాలుగు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల నుండి 12,553 మందిని 143 షెల్టర్ హౌస్‌లకు తరలించారు. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో ముగ్గురు మృతి చెందారని అధికారులు తెలిపారు. తూత్తుకుడి పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి.
Tamil Nadu Rains: తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాల నేపధ్యంలో నాలుగు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల నుండి 12,553 మందిని 143 షెల్టర్ హౌస్‌లకు తరలించారు. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో ముగ్గురు మృతి చెందారని అధికారులు తెలిపారు. తూత్తుకుడి పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి.
దీనితో ఇక్కడ మెడికల్ కాలేజీ నుంచి పలువురు రోగులను బలవంతంగా డిశ్చార్జ్ అయ్యారు. నీరు, ఆహారం, ఇతర మౌలిక వసతులు లేవని రోగులు వాపోయారు. నవజాత శిశువును తమ చేతుల్లో ఎత్తుకుని తల్లిదండ్రులు వరదలతో నిండిన వీధుల్లో నడుస్తున్నట్లు వీడియో వైరల్ అవుతోంది. తిరునెల్వేలి మరియు తూత్తుకుడి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ ద్వారా ఆహార ప్యాకెట్లను జారవిడిచారు.సోమవారం దక్షిణ తమిళనాడులోని శ్రీవైకుంటం వద్ద సుమారు 800 మంది ప్రయాణికులు చిక్కుకుపోవడంతో వారిని రక్షించే పని కొనసాగుతోందని అధికారులు తెలిపారు. సైన్యం వరద ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను తరలించడంలో, వారికి వైద్య సంరక్షణ అందించడంలో చురుగ్గా పనిచేస్తోంది.
ఒక్క రోజులోనే ఏడాది వర్షం..(Tamil Nadu Rains)
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సంప్రదించి, కష్టతరమైన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అదనపు హెలికాప్టర్లను మోహరించాలని అభ్యర్థించారు.రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో ఒక్కరోజులోనే ఏడాది వర్షాలు కురిశాయని, దీని వల్ల పెద్దఎత్తున వరదలు, విధ్వంసం సంభవించాయని స్టాలిన్ చెప్పారు.గ్రామాలు మరియు పట్టణాలు ఇళ్ళు జలమయమయ్యాయి మరియు నివాసితులు పైకప్పులపై ఆశ్రయం పొందుతున్నారు. నాగర్‌కోయిల్‌లోని నెసవలర్ కాలనీలో 100 ఇళ్లనుంచి ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించారు. 1,545 కుటుంబాలకు చెందిన సుమారు 7,500 మందిని 84 సహాయ కేంద్రాల్లో ఉంచారు. సహాయక చర్యల కోసం అధికారులు 84 బోట్లను వినియోగిస్తున్నారు.దక్షిణ తమిళనాడులోని 39 ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.తూత్తుకుడి, తిరునెల్వేలి, తెన్‌కాసి, కన్నియాకుమారి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైందని, దక్షిణ తమిళనాడులోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైందని ఐఎండీ బులెటిన్‌లో పేర్కొంది.