Published On:

Granddaughter’s Chat : మనవరాలి చిట్‌చాట్‌.. అమ్మమ్మ అకౌంట్ నుంచి రూ.80 లక్షలు మాయం

Granddaughter’s Chat : మనవరాలి చిట్‌చాట్‌.. అమ్మమ్మ అకౌంట్ నుంచి రూ.80 లక్షలు మాయం

Granddaughter’s Chat : ఓ బాలిక తెలియకుండా చేసిన తప్పుకు తీవ్ర నష్టం జరగడమే కాకుండా తన అమ్మమ్మ బ్యాంకు ఖాతాలోని రూ.80 లక్షలు పోగొట్టుకునేలా చేసింది. అయితే పాఠశాల ఉపాధ్యాయుడి సహాయంతో కుటుంబం మోసం నుంచి బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని గురుగ్రామ్‌ గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని మాటల మధ్యలో తాము భూమిని అమ్మి వేశామని, రూ.80 లక్షలు వచ్చినట్లు తన స్నేహితురాలికి చెప్పింది. డబ్బులు మొతం తన అమ్మమ్మ బ్యాంకు అకౌంట్‌లో ఉన్నాయని చెప్పగా, విషయాన్ని 10వ తరగతి విద్యార్థి విన్నాడు. డబ్బులను ఎలాగైనా కాజేయాలని ఆ విద్యార్థికి దుర్బుద్ధి పుట్టగా, విషయం గురించి తన సోదరుడికి చెప్పాడు. వీరు మరికొందరితో కలిసి వృద్ధురాలి వద్ద ఉన్న డబ్బు కాజేయాలని ప్లాన్‌ చేసుకున్నారు.

ఈ క్రమంలోనే సుమిత్ కటారియా అనే యువకుడు అన్‌లైన్‌లో బాలికతో పరిచయం పెంచుకున్నారు. తర్వాత బాలిక ఫొటోలు సేకరించాడు. అనంతరం ఫొటోలను మార్ఫింగ్ చేసి, డబ్బు ఇవ్వకపోతే సోషల్‌ మీడియాలో పెడుతామని బాలికను బెదిరించారు. దీంతో తన అమ్మమ్మకు విషయం తెలియకుండా విద్యార్థిని పలు మార్లు వారి ఖాతాలోకి డబ్బులను బదిలీ చేసింది. డబ్బులు అయిపోయినా కూడా వారు బెదిరింపులకు పాల్పపడ్డారు. దీంతో విషయాన్ని బాలిక తమ టీచర్‌కు చెప్పింది. టీచర్ సహాయంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.36 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: