Last Updated:

Pawan Kalyan: తమిళనాడులోనూ జనసేన.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: తమిళనాడులోనూ జనసేన.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan intresting comments about tamilnadu politics: ఏపీ డిప్యూటీ సీఎం, జనసనే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో హిందీ, తమిళం తదితర భాషలపై మాట్లాడిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా, ఓ తమిళ మీడియాతో పలు ఆసక్తికర వ్యాఖ్యలు మాట్లాడారు. భవిష్యత్తులో అన్ని అనుకూలంగా జరిగితే తమిళనాడులో కూడా జనసేన పార్టీని విస్తరించే అవకాశం ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

 

ఇప్పటివరకు తాను ఏ విషయాన్ని ముందు ప్లాన్ చేసుకోనని, ఒకవేళ తమిళ ప్రజలు అందుకు అనుగుణంగా ఆ వాతావరణాన్ని సృష్టిస్తే తప్పకుండా జనసేన రంగంలోకి దిగుతుందని వెల్లడించారు. అనంతరం భాషా విధానంపై మాట్లాడారు. ప్రతి భాషను గౌరవిస్తానని, ప్రతి ఒక్కరూ ప్రతి భాషను గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు.

 

ఇక పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భాషా విధానంపై మాట్లాడితే తప్పు ఏముందని అన్నారు. ఏపీలో మొత్తం 30 తమిళం, 107 ఒరియా, 57 కన్నడ, 5 సంస్కృతం, 400 ఉదర్దూ 37వేల పాఠశాలల్లో తెలుగు కొనసాగుతుందన్నారు. ఇక, రాజకీయాలతో పాటు సినిమాల్లో కొనసాగుతురా? అని ప్రశ్నించగా.. డబ్బులు అవసరం ఉన్నన్ని రోజులు నటిస్తానని పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు.