Published On:

NTR- Neel: ఎన్టీఆర్ కు కూడా అలా చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా నీల్ మావా.. ?

NTR- Neel: ఎన్టీఆర్ కు కూడా అలా చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా నీల్ మావా.. ?

NTR- Neel: సాధరణంగా సినిమాకు ఏ ప్రేక్షకుడు అయినా ఎందుకు వెళ్తాడు. 24 గంటలు కష్టపడుతూ.. కుటుంబ బాధ్యతలను మోస్తూ చిరాకులు, వివాదాలు ఇలాంటివన్నీ మర్చిపోయి మూడు గంటలు థియేటర్ ఓ ఆనందంగా ఎంజాయ్ చేయడానికి, బయట చూడలేని అందాలను ఆస్వాదించడానికి వెళ్తాడు. ఒకప్పుడు సినిమాల్లో కామెడీ, గ్లామర్ ఎక్కువగానే కనిపించేవి. ఉన్నకొద్దీ జనరేషన్ తో పాటు.. ఆ ట్రెండ్ కూడా మారిపోయింది.

 

ఒక స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ తో రొమాంటిక్ సాంగ్ అయినా ఉండాలి. లేదా.. ఐటెంసాంగ్ అయినా ఉండాలి. కానీ, ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఇవేమి ఉండవు.  కెజిఎఫ్ 2 మాత్రమే ఏదైనా పుణ్యం చేసుకొని ఉండాలి. అందులోనే ఈ రెండు సాంగ్స్ ను పెట్టాడు.  సలార్ అయితే.. అసలు హీరోయిన్ ఒక వస్తువు అన్నట్లే ఉంటుంది. ప్రభాస్ – శృతి హాసన్ మధ్య ఒక చూపు, ఒక మాట కూడా ఉండదు. కనీసం వారిద్దరి మధ్య ఒక మాట ఉందనుకొనేలోపు.. దేవా అంటూ వాళ్ళమ్మ వచ్చేస్తుంది. అలా గ్లామర్ లేని సినిమాగా సలార్ ను తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్.

 

ఆరడుగుల కటౌట్ ఉంటే.. గ్లామర్, ఐటెంసాంగ్ మాకెందుకు అనుకున్నారో ఏమో అభిమానులు.. ప్రభాస్ కోసం వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు ఇదే ఫంథాలో డ్రాగన్ కూడా తెరకెక్కిస్తున్నాడట నీల్.  మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం డ్రాగన్. ఈ సినిమా టైటిల్ ను ఇంకా కన్ఫర్మ్ చేయకపోయినా.. అదే టైటిల్ ఫిక్స్ అని ఇండస్ట్రీలో టాక్.  పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న డ్రాగన్.. సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతోంది.

 

ఎప్పటి నుంచో ఈ సినిమాకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో శృతి హాసన్ ఒక ఐటెంసాంగ్ చేస్తుందని వార్తలు వినిపించాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. నీల్ మావా ఏంటి.. ఐటెంసాంగ్ పెట్టడం ఏంటి అనుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

 

డ్రాగన్ మొత్తం ఎన్టీఆర్ వన్ మ్యాన్ షోగా నడుస్తోంది అంట. గ్లామర్ లేని ఎన్టీఆర్ సినిమాను మొదటిసారి చూడబోతున్నామని టాక్. సలార్ లో ఎలాగైతే శృతి కనిపిస్తుందో.. ఇందులో కూడా రుక్మిణి అలానే కనిపిస్తుందట. అసలు ఇంకా చెప్పాలంటే మహిళా పాత్రలే తక్కువ కనిపించనున్నాయని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఈ వార్త తెలిసాక ప్రేక్షకులు మాత్రం ఎన్టీఆర్ సినిమాకు కూడా అలా చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా.. ? అని ప్రశ్నిస్తున్నారు. మరి డ్రాగన్ ను ప్రశాంత్ నీల్ ఎలా చెక్కుతాడో చూడాలి.