Home /Author anantharao b
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని గత 2019లో కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించగా, దీనిపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో సూరత్ కోర్టు గురువారం తీర్పును వెలువరించింది.
ప్రపంచ అథ్లెటిక్స్ అంతర్జాతీయ ఈవెంట్లలో మహిళా విభాగంలో ట్రాన్స్ జెండర్ మహిళలను పోటీ చేయకుండా నిషేధించింది. ఇది ఇతర అథ్లెట్లకు టెస్టోస్టెరాన్ పరిమితులను కూడా కఠినతరం చేసింది
ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడంలో ఈడీ, సీబీఐలను ఏకపక్షంగా ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14 రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ ముఠా గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కంప్యూటర్లు, ఫోన్‌లు, చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 16.8 కోట్ల మంది డేటాను సేకరించి విక్రయించినట్లు విచారణలో గుర్తించారు.
:ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఊహించని విజయాన్ని కైవసం చేసుకుంది. 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి... 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీక్ కు సంబంధించి సిట్ విచారణకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సిట్ కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
వ్యాపారం లేదా పర్యాటక వీసాపై యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లే వ్యక్తులు ఇప్పుడు కొత్త ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని ఫెడరల్ ఏజెన్సీ యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్)తెలిపింది.
మన పొరుగున ఉన్న పాకిస్తాన్ తీవ్ర మైన ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యుడికి రెండు పూటల తిండి దొరకడమే గగనమైంది. బిలియన్ డాలర్ల అప్పు కోసం ఐఎంఎఫ్ కాళ్లా వేళ్లా పడ్డా కనికరించడం లేదు
ఉగాండా పార్లమెంట్ మంగళవారం నాడు LGBTQగా గుర్తించడాన్ని నేరంగా పరిగణించే చట్టాన్ని ఆమోదించింది, ఇప్పటికే చట్టపరమైన వివక్ష మరియు గుంపు హింసను ఎదుర్కొంటున్న స్వలింగ సంపర్కులను లక్ష్యంగా చేసుకోవడానికి అధికారులకు విస్తృత అధికారాలను అందిస్తుంది
సదరన్ రైల్వే చీఫ్ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ రోసలిన్ అరోకియా మేరీ అక్రమంగా లేదా టిక్కెట్ లేని ప్రయాణికుల నుంచి రూ.1.03 కోట్ల జరిమానాలు వసూలు చేశారు.ప్రయాణీకుల నుండి కోటి రూపాయలకు పైగా జరిమానా వసూలు చేసిన మొదటి మహిళా టిక్కెట్ తనిఖీ అధికారిగా ఆమె కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుండి ప్రశంసలు అందుకుంది.