Published On:

Khushbu Sundar: ఏ యుగంలో బతుకుతున్నాం – సిగ్గుగా అనిపించడం లేదా?: నటి ఖుష్బూ ఆగ్రహం

Khushbu Sundar: ఏ యుగంలో బతుకుతున్నాం – సిగ్గుగా అనిపించడం లేదా?: నటి ఖుష్బూ ఆగ్రహం

Khushbu Fires on Tamil Nadu Incident: తమిళనాడులో ఓ విద్యార్థిని పట్ల అవమానీయ ఘటన చోటుచేసుకుంది. నెలసరి పేరిట ఆ విద్యార్థినిని తరగతి బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశమైంది. దీనిపై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై సీనియర్‌ నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ స్పందించారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ మనం ఏ యుగంలో బతుకుతన్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

“నెలసరి కారణంగా విద్యార్థినిని క్లాస్‌ రూమ్‌ బయటే కూర్చోబెట్టి పరీక్ష రాయించడం విచారకరం. ఈ ఘటన నన్నేంతో ఆవేదనకు గురి చేసింది. ఇలాంటి అవమానీయ ఘటన నా రాష్ట్రంలోనే జరగడం షాక్‌కు గురి చేసింది. మనం ఏ యుగంలో బతుకుతున్నాం? ఎక్కడ ఉన్నాం? ఇలాంటి పనులకు పాల్పడిన విద్యాసంస్థలు, అందులోని సిబ్బందికి ఏ మాత్రం సిగ్గుగా అనిపించడం లేదా? వారిపై తప్పకుండ చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఆ విద్యార్థినికి వారు క్షమాపణలు చెప్పాలి. నెలసరి అనేది సర్వసాధారణం. అది సహాజమైన చర్య, మానసిక పరిపక్వత లేని ఇలాంటి అధికారులకు గుణపాఠం నేర్పించాలి” అని ఖుష్బూ మండిపడ్డారు.