Published On:

Tamil Nadu: పోలీస్టేషన్ కు చిరుతపులి!

Tamil Nadu: పోలీస్టేషన్ కు చిరుతపులి!

Tamil Nadu:  సాధారణంగా జనం పోలీస్ స్టేషన్‌కు తమ సమస్యలపై వెళ్లడం అందరికి తెలిసిందే.. అప్పుడప్పుడు పట్టుబడిన పందెం కోళ్లను కూడా పోలీస్ స్టేషన్‌లలో చూస్తుంటాం. కాని ఓ పోలీస్ స్టేషన్‌‌కు మాత్రం ఏకంగా చిరుతపులి వచ్చింది. ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా? తమిళనాడులోని నీలగిరి జిల్లా నడువట్టం పోలీస్ స్టేషన్‌లోకి చిరుతపులి వెళ్లింది. స్టేషన్ మొత్తం తిరిగి ఎవరు లేకపోవడంతో చిరుత వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.

చిరుత పులి బయటకు వెళ్లిందని నిర్ధారించుకున్న కానిస్టేబుల్ స్టేషన్ తలుపులు మూసేశారు. చిరుత పోలీస్ స్టేషన్‌కు వచ్చిందని తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. చిరుత పులి స్టేషన్‌లో తిరిగిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు పలురకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. పీఎస్‌కు పులి కంప్లైంట్ ఇద్దాం అని వచ్చిందేమో? అని ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

 

దారితప్పి స్టేషన్‌లోకి వచ్చింది చిరుత పులి. మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్లిన చిరుత ఇన్స్పెక్టర్ రూముకు వెళ్లింది. మరో గదిలో కానిస్టేబుల్ ఉన్నాడు. చిరుతను చూసిన అతను దాక్కున్నాడు. గదిలో తిరిగిన చిరుత ఆహారం లేకపోవడంతో వచ్చిన దారినే వెళ్లిపోయింది. సీసీ కెమెరాలో ఈ వీడియో వైరల్ అయింది. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.