Published On:

AP ECET-2025  : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఏపీ ఈసెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల

AP ECET-2025  : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఏపీ ఈసెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల

AP ECET-2025  :  జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించే ఏపీ ఈసెట్-2025 పరీక్షల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. మే 6న ఏపీ ఈసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. రెండు విడుతలుగా పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ సందర్భంగా జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శనరావు మాట్లాడారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు మెదటి విడుత, మధ్యాహ్నం 2 నుంచి సాయంంత్రం 5 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మొత్తం 110 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఒకే పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

 

35,187 మంది విద్యార్థుల దరఖాస్తు..
మొత్తం 35,187 మంది విద్యార్థులు ఏపీ ఈసెట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందు విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. క్యాలిక్ లేటర్, మొబైల్స్, స్మార్టు వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని వెల్లడించారు. మే 17న జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ సుదర్శనరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. మే 2 నుంచి మొదలయ్యే ప్రవేశ పరీక్షలు జూన్ 13వ తేదీతో ముగియనున్నాయి.

 

 

ఇవి కూడా చదవండి: