Published On:

Mrunal Thakur: స్టార్ కిడ్ వలన మృణాల్ కు అవమానం.. ఇదేమి కొత్త కాదే

Mrunal Thakur: స్టార్ కిడ్ వలన మృణాల్ కు అవమానం.. ఇదేమి కొత్త కాదే

Mrunal Thakur: సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది మృణాల్ ఠాకూర్. సీరియల్ హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్ గా మారిన మృణాల్.. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. సీతగా ఆమెను తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. ఆ తరువాత హయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలతో ఈ చిన్నది తెలుగువారికి మరింత చేరువ అయ్యింది.

 

అందరిలా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోకుండా తన కెరీర్ కు ఏది ఉపయోగపడుతుందో అలాంటి సినిమాలను ఎంపిక చేసుకొని మంచిగా ప్లాన్ చేసుకుంటుంది మృణాల్. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఎక్కడికి వెళ్లినా ఆమె సెంట్రాఫ్ ఎట్రాక్షన్. అయితే ఇంత పాపులారిటీ ఉన్న మృణాల్ కి క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్స్ అవార్డ్స్ వేడుకలో అవమానం జరిగింది.

 

ఇక ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఒక స్టార్ కిడ్ వలన తనకు ఆ అవమానం జరిగిందని ఆమె చెప్పుకురావడం సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచింది. ” ఆ వేడుకకు నేను వెళ్లగానే అక్కడ ఉన్న మీడియా మొత్తం నా చుట్టూ మూగారు. ఒకరి తరువాత ఒకరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. నేను ఒక్కో ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. ఇంతలోపే అక్కడకు జాన్వీ కపూర్ రావడం గమనించిన ఫోటోగ్రాఫర్స్.. నన్ను వదిలేసి ఆమె చుట్టూ మూగారు.

 

ఆ ఇన్సిడెంట్ కి నేను చాలా బాధపడ్డాను. అది నన్ను ఎంతో ఆవేదనకు గురిచేసింది. ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ కు ఉన్నంత ప్రాధాన్యత కష్టపడి పైకి వచ్చినవారికి లేదు” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వాక్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మృణాల్ మాటలు విన్న తెలుగువారు ఇదేమీ ఇక్కడ కొత్తేమీ కాదు. ప్రతి చోటా ఉండేదే. స్టార్స్ వచ్చినప్పుడు.. స్టేజీపై yevaru మాట్లాడుతున్నా వారినీ ఎవరు పట్టించుకోరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.