Allu Arjun: అమ్మో లైగర్ బ్యూటీనా.. ఎందుకు అట్లీ బ్రో రిస్క్.. ?

Allu Arjun: పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ భారీ హిట్ ను అందుకున్నాడు. ఎన్ని వివాదాలు వచ్చినా కూడా వాటి నుంచి బయటపడి.. స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. ఇక పుష్ప 2 తరువాత బన్నీ.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను ఓకే చేసిన బన్నీ.. ఈమధ్యనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమాను ఓకే చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన వీడియో ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలందరూ.. వేరే భాషల్లోని స్టార్ డైరెక్టర్స్ తో కొలాబరేట్ అవుతున్నారు. అట్లీ.. జవాన్ తో బాలీవుడ్ కు ఇండస్ట్రీ హిట్ ఇచ్చి.. ఇక ఇప్పుడు టాలీవుడ్ కు హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా ఎప్పుడైతే అధికారికంగా ప్రకటించారో.. అప్పటి నుంచి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ముఖ్యంగా AA22 కోసం స్టార్ హీరోయిన్స్ ను రంగంలోకి దింపుతున్నారనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. రోజుకో హీరోయిన్ పేరు అల్లు అర్జున్ సరసన వస్తుంది.
మొన్నటికి మొన్న మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆ తరువాత దీపికా పదుకొనే అన్నారు. ఆ తరువాత నలుగురు హీరోయిన్స్ అని కొంతమంది చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఇంకో బాలీవుడ్ భామ పేరు చేరింది. ఆమె స్టార్ కిడ్ అనన్య పాండే. సాధారణంగా ఎలాంటి ప్లాప్ ఇచ్చినా తెలుగు ప్రేక్షకులు అంతగా పట్టించుకోరు కానీ, అనన్య ఇచ్చిన ప్లాప్ ను మాత్రం అంత తేలిగ్గా తెలుగు ప్రేక్షకుడు మరిచిపోలేడు. విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన లైగర్ సినిమాలో అమ్మడి నటనకు ఫ్యాన్స్ ట్రోల్ చేసినట్లు ఇంకే హీరోయిన్ను చేయలేదంటే అతిశయోక్తి కాదు.
ఇక ఈ సినిమా తరువాత అనన్య టాలీవుడ్ లో ఇంకోసారి కనిపించడానికే భయపడేలా చేశారు. హిందీలో కూడా అనన్య.. ఈ మధ్యనే సెట్ అవుతుంది. కాల్ మీ బే, కంట్రోల్ సిరీస్ లతో ఈ చిన్నది మంచి విజయాలను అందుకుంది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీనే.. అల్లు అర్జున్- అట్లీ సినిమాలో దింపుతున్నారట. ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడట. అనన్య ఒకరికి జోడిగా నటిస్తుండగా.. ఇంకో హీరోయిన్ కోసం మేకర్స్ వెతుకుతున్నారట.
అయితే ఎవరిని తీసుకున్నా పర్లేదు కానీ.. అనన్యను వద్దు అని బన్నీ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. లైగర్ తో ఐరెన్ లెగ్ గా ముద్ర వేయించుకున్న అనన్యను తీసుకుంటే.. ఈ సినిమా కూడా అలానే ఉంటుందని భయపడుతున్నారు. ఎందుకు బ్రో అంత రిస్క్.. వేరే హీరోయిన్ ను తీసుకోండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.