Last Updated:

Mukesh Ambani: అంబానీకి మరోసారి బెదిరింపు కాల్స్.. 3 గంటల్లో చంపేస్తానంటూ..!

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు కాల్స్ వచ్చాయి. రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌లోని ల్యాండ్‌లైన్ ఫోన్కు ఓ ఆగంతుకుడు ఫోన్ చేసి హాస్పటల్ను పేల్చాస్తానంటూ బెదింరించినట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

Mukesh Ambani: అంబానీకి మరోసారి బెదిరింపు కాల్స్.. 3 గంటల్లో చంపేస్తానంటూ..!

Mukesh Ambani: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు కాల్స్ వచ్చాయి. రిలయన్స్‌ ఫౌండేషన్‌ హాస్పిటల్‌లోని ల్యాండ్‌లైన్ ఫోన్కు ఓ ఆగంతుకుడు ఫోన్ చేసి హాస్పటల్ను పేల్చాస్తానంటూ బెదింరించినట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

బుధవారం మధ్యాహ్నం 12.57 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి కాల్ వచ్చిందని ముంబయి పోలీసు వర్గాలు తెలిపాయి. రిలయన్స్ ఆస్పత్రిని పేల్చేస్తామని దుండగుడు బెదిరించినట్టు వెల్లడించారు. అంబానీ కుటుంబానికి చెందిన కొంతమంది సభ్యుల పేర్లు చెప్పి మరీ బెదిరింపులకు పాల్పడినట్టు పేర్కొన్నారు. అయితే ఇంతకుముందు అనగా ఆగస్టు 15న కూడా అంబానీ కుటుంబానికి ఇదే తరహాలో బెదిరింపు కాల్స్ వచ్చాయి. అంబానీతో పాటు ఆయన కుటుంబాన్ని 3 గంటల్లో చంపేస్తామని ఓ ఆగంతుకుడు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నెంబర్​కు ఏకంగా ఎనిమిది సార్లు దుండగుడు బెదిరింపు కాల్స్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బెదిరింపు కాల్స్​పై ఆస్పత్రి వర్గాలు డీబీ మార్గ్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చెయ్యగా అలెర్ట్ అయిన పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని వెంటనే అంబానీ నివాసానికి పెద్ద సంఖ్యలో సిబ్బందిని పంపారు. అంబాని నివాస ప్రాంతంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా ముంబయి దహిసర్​ ప్రాంతంలో ఓ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

కాగా గతంలోనూ అంబానీ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయన్న సంగతి విదితమే. ఇలా వరుసగా అంబానీ కుటుంబానికి బెదిరింపు కాల్స్ రావడం కలకలం సృష్టిస్తుంది.

ఇదీ చదవండి:ఎయిర్ టెల్ యూజర్లకు భారీ షాక్.. ఆ ఫోన్లకు 5జీ అందడం లేదు

ఇవి కూడా చదవండి: