Published On:

Indian Railways: ఆ రూట్ ప్రయాణికులకు అదిరిపోయే వార్త.. 104 కి.మీల డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం!

Indian Railways: ఆ రూట్ ప్రయాణికులకు అదిరిపోయే వార్త.. 104 కి.మీల డబ్లింగ్ పనులకు కేంద్రం ఆమోదం!

Cabinet approves doubling of single railway line: కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి టూ పాకాల, పాకాల టూ కాట్పాడి మధ్య దాదాపు 104 కిలోమీటర్ల వరకు డబ్లింగ్ పనులు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ తిరుపతి – పాకాల – కాట్పాడి డబ్లింగ్ పనులను రూ.1,332 కోట్లతో చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

 

తిరుపతి – పాకాల – కాట్పాడి డబ్లింగ్ పనులు జరిగితే పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలు తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరికోట ఈ డబ్లింగ్ ప్రాంతంలో ఉండడంతో లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

 

కాగా, తిరుపతి టూ వెల్లూరు విద్యతో పాటు వైద్యంలోనూ మంచి అభివృద్ధి చెందింది. ఈ డబ్లింగ్ పనులతో మొత్తం 400 గ్రామాల్లో సుమారు 14 లక్షల మంది ప్రజలకు మేలు జరగనుంది. ఈ పనులతో సుమారు 35 లక్షల పనిదినాల కల్పనకు అవకాశం ఉండనుంది. అంతేకాకుండా, ఏడాదికి 4 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు.