Home / Mukesh Ambani
నీతా, ముకేశ్ అంబానీ గారాల కొడుకు అనంత్ అంబానీ మ్యారేజ్ అట్టహాసంగా చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహ వేడుకకు దేశంలోనే కాదు..వరల్డ్ వైడ్ గా ఉన్న వీవీఐపీలు హాజరయ్యారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుక అట్టహాసంగా నిర్వహించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం ఆదివారం నాడు న్యూఢిల్లీలోని రాష్ర్టపతి భవన్లో కన్నుల పండువగా జరిగింది. దేశ, విదేశాల నుంచి పలువురు అతిథులను ఆహ్వానించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీకి సోమవారం రూ. 400 కోట్లు ఇవ్వాలని లేకపోతే చంపుతామంటూ బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది, గత 4 రోజులుగా పంపిన బెదిరింపుల ఈ మెయిల్స్ లో ఇది మూడవది కావడం విశేషం.
ఆసియా అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డును ప్రక్షాళన చేశారు. బోర్డులోకి కొత్తగా తన ముగ్గురు పిల్లలు ఈషా, ఆకాశ్, అనంత్ అంబానీలను తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన ముగ్గురు పిల్లలు తమ తమ వ్యాపార కార్యకలాపాలు చూసుకొనే వారు.
భారతదేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ తనకు కుడిభుజంగా పిలవబడే చిరకాల ఉద్యోగి మనోజ్ మోదీకి ఊహించని రీతిలో విలువైన బహుమతిని ఇచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీ మోదీకి 22-అంతస్తుల భవనాన్ని బహూకరించారు.
నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘ఎన్‌ఎంఏసీసీ’ఎంతో పేరు పొందింది. భారత సంస్కృతి, కనుమరుగవుతున్న కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ ఈ కల్చరల్ సెంటర్ ను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని.. ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు.
విశాఖపట్నం వేదికగా "గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023" అట్టహాసంగా ప్రారంభమైంది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర గీతం అయిన ‘మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ..’ గీతాన్ని మొదటగా ఆలపించారు.
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ, బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్ మరియు ధర్మేంద్రల ముంబై నివాసాలను పేల్చివేస్తానని మంగళవారం ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి బెదిరించాడు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఆయన యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ -2023 లో మాట్లాడుతూ.. టెలికం, రిటైల్, న్యూ ఎనర్జీ వ్యాపారాల్లో వచ్చే నాలుగు సంవత్సరాల్లో 75వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు చెప్పారు.