Published On:

Smita Sabharwal: ఐఏఎస్​ స్మితా సబర్వాల్​‌కు బిగ్ షాక్.. పోలీసుల నోటీసులు

Smita Sabharwal: ఐఏఎస్​ స్మితా సబర్వాల్​‌కు బిగ్ షాక్.. పోలీసుల నోటీసులు

Gachibowli police Notices to Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు బిగ్ షాక్ తగిలింది. రాష్ట్ర పర్యాటక శాక కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంపై ఓ ఫేక్ పోస్టును రీ ట్వీట్ చేసింది. దీంతో ఆమెకు ఈనెల 12న పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

కంచ గచ్చిబౌలి భూముల విషయంపై గత కొంతకాలంగా వివాదం చోటుచేసుకుంటుంది. ఈ తరుణంలో కొంతమంది ఏఐ ఫొటోలు,వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఈ విషయంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఫైర్ అయ్యారు. ఫేక్ పోస్టులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అనంతరం నకిలీ పోస్టులు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టిన బీఆర్ఎస్ నాయకులకు పోలీసులు నోటీసులు అందజేశారు. అలాగే ప్రముఖులకు సైతం చర్యలు తీసుకున్నారు.

 

ఇదే విషయంపై తాజాగా, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ హాయ్ హైదరాబాద్ ఎక్స్ అకౌంట్ నుంచి ఓ గిబ్లీ ఫొటోను స్మితా సబర్వాల్ రీ ట్వీట్ చేసింది. దీంట్లో హెచ్‌సీయూ భూముల్లో బుల్డోజర్లు ఉన్నట్లు ఉంది. అలాగే ఆ ఫొటోలో గిబ్లీ రూపంలో నెమలి, జింక కూడా కనిపిస్తున్నాయి. ఇలా ఆమె రీ ట్వీట్ చేసిన ఫొటో ఫేక్ అని తేలింది. దీంతో స్మితా సబర్వాల్‌కు బీఎన్ఎస్ఎస్ యాక్ట్ సెక్ష్ 179 ప్రకారం నోటీసులు జారీ చేశారని సమాచారం. ఈ నోటీసులపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.