Published On:

Former ISRO chairman: ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత

Former ISRO chairman: ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత

Former ISRO chairman Kasturirangan passes away: ఇస్రో మాజీ ఛైర్మన్ కృష్ణస్వామి కస్తూరి రంగన్(84) కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. బెంగళూరులో ఆయన నివాసంలో శుక్రవారం కన్నుమూశారు. కృష్ణస్వామి కస్తూరి రంగన్.. జేఎన్‌యూ ఛాన్స్‌లర్‌గా పనిచేశారు. అలాగే కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.

 

కృష్ణస్వామి కస్తూరి రంగన్.. ఇస్రో, అంతరిక్ష కమిషన్ ఛైర్మన్‌, అంతరిక్ష శాఖలో భారత ప్రభుత్వ కార్యదర్శిగా 9 ఏళ్ల పాటు నడిపించారు. 1994 నుంచి 2003 వరకు ఆయన ఇస్రో ఛైర్మన్‌గా కొనసాగారు. ముఖ్యంగా పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2003 ఆగస్టు 27న పదవీ విరమణ పొందారు.

 

అంతేకాకుండా, 2003 నుంచి 2009 మధ్యలో రాజ్యసభలో సభ్యుడిగా కూడా ఉన్నారు. అయితే 2004 నుంచి 2009 వరకు బెంగళూరులోని ఓ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ సెంటర్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. ఇక, కేంద్రంలో మోదీ హయంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో కొత్త జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి ఆయన అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.