Mehul Choksi arrest: రూ.13వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్.. బెల్జియంలో మెహేల్ చోక్సీ అరెస్ట్!

Mehul Choksi Arrested in Belgium: వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13వేల కోట్లకుపైగా మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా, ఈ కేసు విషయంలో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీను బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. భారత ఏజెన్సీలు అయిన సీబీఐ, ఈడీ కోరిక మేరకు ఆయనను అరెస్ట్ చేశారు.
మెహుల్ చోక్సీ అరెస్టుపై కేంద్రం స్పందించింది. మెహుల్ చోక్సీ అరెస్ట్ దేశానికి అతిపెద్ద విజయమని కేంద్ర మంత్రి పంక్ చౌదరి అన్నారు. 2018లో మోసం చేసి దేశం నుంచి పారిపోయిన మెహుల్ చోక్సీ కోసం భారత ఏజెన్సీలు ఏడు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాయి. 2021లో చిక్కినట్టే చిక్కి అనారోగ్యం కారణంతో తప్పించుకున్నాడు. ఆ సమయంలో డొమినికన్ రిపబ్లిక్ దేశంలోకి అక్రమగా చొరబడ్డాడని ఆయనను అరెస్టు చేశారు.
ఈ తరుణంలో ఆయన కస్టడీ కోసం వెళ్లిన సీబీఐకి ఎదురుదెబ్బ తగిలింది. 51 రోజుల జైలు జీవితం అనంతరం బ్రిటిష్ క్వీన్స్ ప్రివీ కౌన్సిల్ నుంచి బిగ్ రిలీఫ్ రావడంతో చోక్సీ అప్పగింత నుంచి తప్పించుకున్నాడు. అప్పటినుంచి సీబీఐతోపాటు ఈడీ మెహుల్ చోక్సీ కోసం ట్రాక్ చేస్తూనే ఉన్నాయి.
ఇటీవల మెహుల్ చోక్సీ బెల్జియం వెళ్లినట్లు సీబీఐ, ఈడీకి సమాచారం అందింది. దీంతో అక్కడి సంస్థలకు అప్రమత్తం చేయడంతో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్‌నకు సంబంధించిన పత్రాలను చూపించి అరెస్ట్ కోసం అనుమతి తీసుకున్నాయి. ఇందులో భాగంగానే ఆయనను అరెస్ట్ చేశారు.