Published On:

Paradise Movie: నాని కోసం కిల్ విలన్.. ఈసారి గురి తప్పదు..?

Paradise Movie: నాని కోసం కిల్ విలన్.. ఈసారి గురి తప్పదు..?

Paradise Movie: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఈ మధ్యనే కోర్ట్ సినిమాతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్న నాని.. హిట్ 3 సినిమాతో హీరోగా మరో హిట్ కొట్టడానికి సిద్ధమయ్యాడు. మే 1 న ఈ సినిమ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత నాని నటిస్తున్న చిత్రం ప్యారడైజ్. దసరా సినిమాతో భారీ విజయాన్ని అందించిన శ్రీకాంత్ ఓదెల.. ఈసారి ప్యారడైజ్ తో మరో హిట్ ను ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ఇండస్ట్రీని షేక్ చేసింది.

 

ఇది ఒక లం** కొడుకు కథ అని పచ్చి బూతుతో మొదలైన ఈ వీడియో సెన్సేషన్ గా మారింది. ఇక ఈ సినిమాలో నాని తల్లిగా ఎవరు నటిస్తున్నారు అనేది పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే.. ఆ పదానికి న్యాయం చేయగల నటి ఎవరో అని తెలుసుకోవడానికి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆ పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఇక ఇదంతా పక్కన పెడితే.. నాని.. కొత్త డైరెక్టర్స్ ను, కొత్త హీరోయిన్స్ ను మాత్రమే కాకుండా ఈసారి విలన్స్ ను కూడా తెలుగుతెరకు పరిచయం చేస్తున్నాడు.

 

ఇది MCA సినిమా నుంచి మొదలయ్యింది. ఆ సినిమాలో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను టాలీవుడ్ కి విలన్ గా పరిచయం చేశాడు. ఈ సినిమా హిట్ కాకపోవడంతో విజయ్ వర్మకు మరో సినిమా దక్కలేదు. ఇక ఆ తరువాత దసరా సినిమాలో మలయాళ నటుడు టామ్ షైన్ చాకో ను విలన్ గా పరిచయం చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో చాకోకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

 

ఇక ఇప్పుడు ప్యారడైజ్ కోసం మరో బాలీవుడ్ నటుడుని రంగంలోకి దింపుతున్నాడట నాని. కిల్ సినిమాలో తన విలనిజంతో ఆకట్టుకున్న రాఘవ్ ను సెలెక్ట్ చేశారని టాక్ నడుస్తోంది. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో రాఘవ్ కూడా ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడని అంటున్నారు. మరి ఈ సినిమాతో రాఘవ్ తెలుగులో ఎలాంటి సంచలనం సృష్టించనున్నాడో చూడాలి.

ఇవి కూడా చదవండి: