Published On:

IPL 2025 : అదరగొట్టిన గుజరాత్ బ్యాటర్లు.. రాజస్థాన్ టార్గెట్ 210

IPL 2025 : అదరగొట్టిన గుజరాత్ బ్యాటర్లు.. రాజస్థాన్ టార్గెట్ 210

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ఇవాళ 47 మ్యాచ్ జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. జైపూర్ వేదిక‌గా రాజ‌స్థాన్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో గుజ‌రాత్ బ్యాట‌ర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ మరోసారి అదరగొట్టాడు. 50 బంతుల్లో 84 పరుగులు చేశాడు. అతడితోపాటు బట్లర్‌ (50), సాయి సుదర్శన్‌ (39) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో థీక్షణ 2, అర్చర్‌, సందీప్ శర్మ తలా వికెట్ తీశారు.

 

భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ బ్యాటర్లు ఎలా ఛేజ్ చేస్తారో చూడాలి. మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్తుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఒక్కరోజుల్లో టాప్ ప్లేస్‌కు తిరిగి చేరుకునే అవకాశం గుజరాత్ ముందుంది.

 

 

ఇవి కూడా చదవండి: