Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. 10 గ్రాముల ధర ఎంతంటే?

Gold Rate Decreased Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొంతకాలంగా పెరుగుతున్న బంగారం ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాలతో భారీగా పెరిగిన బంగారం ధరలు దేశీయ మార్కెట్‌లో దిగ్గొచ్చాయి. రూ.లక్షకు చేరువైన తరుణంలో తాజాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.3వేలు తగ్గింది. పన్నులతో కలిసి 24 క్యారెట్ల ధర రూ.99,150 ఉంది. అలాగే వెండి విషయానికొస్తే.. స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.98,720 కొనసాగుతోంది.