UPI Down in India: యూపీఐ వినియోగదారులకు షాక్.. పేమెంట్స్‌లో అంతరాయం!

UPI Payments down for Several Users Across India: యూపీఐ వినియోగదారులకు షాక్ తగిలింది. ఒక్కసారిగా యూపీఐ పేమెంట్స్‌లో అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది పేమెంట్స్ కాకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. అయితే యూపీఐకి సంబంధించి నెట్ వర్క్ స్లో వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కనీసం బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు సైతం వీలుకావట్లేదని అంటున్నారు.
అయితే, ఈ సమస్య దేశ వ్యాప్తంగా తలెత్తుతోంది. యూపీఐ సేవలు ఒక్కసారిగా డౌన్ కావడంతో వినియోగదారులు లావాదేవీలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఈ సమస్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్స్ పనిచేయడం లేదు. ఈ సమస్య మధ్యాహ్నం 12 గంటల నుంచి వస్తుందని, ఇప్పటివరకు 1000కి పైగా యూపీఏ విషయంలో ఇబ్బంది పడినట్లు ఫిర్యాదు చేశారని డౌన్ డిటెక్టివ్ వెబ్ సైట్ పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఇటీవల యూపీఐ సేవల్లో పలుమార్లు అంతరాయం కలుగుతోంది. మార్చి 26న సాంకేతిక కారణాలతో ఇలాంటి పరిస్థితి నెలకుందని ఎన్పీసీఐ పేర్కొన్న విషయం తెలిసిందే. అలాగే ఈనెల 2న కూడా యూపీఐ సేవలకు అంతరాయం కలిగింది. తాజాగా, మరోసారి యూపీఐ సేవల్లో అంతరాయం కలగడంతో వినియోగదారులు చెల్లింపుల విషయంలో తలలు పట్టుకుంటున్నారు.