Terror Attack on India: హెచ్చరిక.. దేశంలో ఉగ్రదాడులు జరగొచ్చు..? బిఅలర్ట్!

Intelligence alert that expected Terror attack on Indian: దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ముంబై ఉగ్రవాదుల సూత్రధారి తహవూర్ ఠానాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. ఈ మేరకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేశారు.
ఇందులో భాగంగా ఐఈడీ, డ్రోన్ దాడులు జరగవచ్చని రైల్వే శాఖను అప్రమత్తం చేశాయి.అంతేకాకుండా నదిమార్గాల్లో తీవ్రవాదులు చొరబడే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి.
అంతకుముందు పాకిస్తాన్ ఉగ్రవాదులు సముద్రమార్గం నుంచి ముంబై చేరుకున్నారు. ఆ తర్వాత సీఎస్ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్ తో ఇతర ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ మేరకు నవంబర్ 29 వరకు కాల్పులు జరిపారు. ఇందులో 18 మంది సిబ్బందితో పాటు 166 మంది మరణించారు.
అలాగే ఈ దాడుల్లో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబై అడిషనల్ పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ అధికారి విజయ్ సలాస్కర్‌తో పాటు ప్రముఖ ఉద్యోగులు తమ ప్రాణాలు కోల్పోయారు.అంతేకాకుండా ఠాణా.. పాకిస్తాన్ ప్రాంతానికి చెందిన కెనడా జాతీయుడు. అదే విధంగా ఆయన 26/11 ముంబై దాడుల్లో కీలకంగా ఉన్నారు.