Published On:

Rakul Preeth Singh: హీరోయిన్స్ సర్జరీ చేయించుకుంటే తప్పేంటి.. ?

Rakul Preeth Singh: హీరోయిన్స్ సర్జరీ చేయించుకుంటే తప్పేంటి.. ?

Rakul Preeth Singh: ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అందం ఉన్నంతవరకే అభిమానం అయినా.. అవకాశాలు అయినా. ఒక్కసారి ఆ అందం కరిగిపోయింది అంటే పట్టించుకొనే నాధుడు ఉండడు అనేది నమ్మదగ్గ నిజం. అందుకే హీరోయిన్స్ ఎప్పుడూ అందం కోసం ఆరాటపడుతూనే ఉంటారు. ఎప్పటికప్పుడు వర్క్ అవుట్స్ అని , డైట్ అని తిండి మానేసి కడుపు కాల్చుకొని ఆ అందాన్ని కాపాడుకుంటున్నారు.

 

ఇంకా మరికొంతమంది సర్జరీల మీద ఆధారపడుతున్నారు. ముక్కు వంకర .. మూతి వంకర అన్న దగ్గర నుంచి చెస్ట్ పెరగడానికి.. పొట్ట తగ్గడానికి కాస్మొటిక్ సర్జరీల మీద ఆధారపడుతూ.. అందాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటి విషయాలు మాత్రం బయటకు చెప్పడానికి భయపడుతుంటారు. సర్జరీలు చేయించుకోవడం తప్పు అని చెప్పుకొస్తారు. కానీ, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం సర్జరీ చేయించుకుంటే తప్పేంటి అని అడుగుతుంది.

 

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ” స్టార్ హీరోయిన్స్ కానీ, లేక వేరే అమ్మాయిలు కానీ కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంటే తప్పేంటి. గతంలో చాలా వ్యాధులకు సర్జరీలు ఉండేవి కాదు. కానీ, ఇప్పుడు అలా కాదు. ప్రతి వ్యాధికి ఒక ట్రీట్మెంట్ దొరుకుతుంది. అలాంటప్పుడు భయపడడం దేనికి. ఎవరైనా అందంగా కనిపించాలనుకోవడం కోసం సర్జరీలు చేయించుకుంటే అందులో తప్పేముంది.

 

అయితే నాకు కాస్మొటిక్ సర్జరీలు చేయించుకునే అవసరం లేదు. ఇప్పటివరకు రాలేదు. ఎందుకంటే నాకు మంచి రూపం ఉంది. దేవుడు నాకు మంచి ముఖాన్ని ఇచ్చాడు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి . ఇకపోతే రకుల్ కెరీర్ విషయానికొస్తే.. ఒక్క సినిమా కూడా చేతిలో లేదు. తన జిమ్, రెస్టారెంట్లు చూసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది.