Published On:

Manchu Family Controversy: మరోసారి రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ వివాదం – జల్‌పల్లి నివాసం వద్ద మనోజ్‌ ఆందోళన!

Manchu Family Controversy: మరోసారి రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ వివాదం – జల్‌పల్లి నివాసం వద్ద మనోజ్‌ ఆందోళన!

Manchu Manoj Protest at Jalpally Home: మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి రచ్చకెక్కింది. జల్‌పల్లిలోని మోహన్‌ బాబు నివాసం వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గేటు ఒపెన్‌ చేయడం లేదంటూ మనోజ్‌ ఇంటిముందు బైఠాయించడంతో అక్కడ మరోసారి ఆందోళన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మంగళవారం తన కారు ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ తన అన్నయ్య మంచు విష్ణుపై మనోజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

 

తాను ఇంట్లో లేని టైం చూసి తన అన్న మంచు విష్ణు అతడి అనుచరులు ఇంట్లోకి చొరబడి దొంగతనం చేశారని, తన కారు ఎత్తుకెళ్లినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసు స్టేషన్‌ నుంచి తిరిగి జల్‌పల్లి నివాసానికి చేరుకున్న మనోజ్‌ను గెట్‌ వద్దే ఆపేసారు. మనోజ్‌తో పాటు ఎవరికి ఇంట్లోకి అనుమతి లేదని గేట్‌ లాక్‌ వేశారు. దీంతో తనని లోపలికి రానివ్వకపోవడంతో ఇంటి ముందే బైఠాయించి నిరసనకు దిగాడు మనోజ్‌.

 

తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా రాజస్థాన్ వెళ్లి తిరిగి వచ్చేసరికి.. తన ఇంట్లో దొంగతన జరిగిందని, కారు వస్తువులు దొంగలించారని చెప్పాడు.  ఇదే విషయాన్ని తన తండ్రితో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన స్పందించడం లేదని చెప్పాడు. ఇప్పుడు తనని ఇంట్లోకి అనుమతించకపోవడంతో ఇంటి ముందే బైఠాయించాడు.  అయితే ప్రస్తుతం తండ్రి మోహన్‌ బాబు అక్కడ ఉన్నారా ? లేదా? అనేది సందిగ్ధత నెలకొంది. ఇక మనోజ్‌ నిరసన వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు జల్‌పల్లి నివాసానికి భారీ బందోస్తుతో చేరుకున్నారు.