Published On:

Masooda OTT: మూడేళ్లకు మరో ఓటీటీకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘మసూద’ – ఎక్కడంటే..!

Masooda OTT: మూడేళ్లకు మరో ఓటీటీకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్‌ హారర్‌ థ్రిల్లర్‌ ‘మసూద’ – ఎక్కడంటే..!

Masooda Arrives On Another OTT Platform: తెలుగులో వచ్చిన బెస్ట్‌ హారర్‌ చిత్రాల్లో మసూద ఒకటి. 2022లో ఎలాంటి అంచనాలు లేకుండ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. చిన్న సినిమా వచ్చి భారీ స్థాయిలో కలెక్షన్స్‌ సాధించింది. ఈ సినిమాతోనే సాయి కిరణ్‌ దర్శకుడిగా పరిచయం అయ్యాడు స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో రాహుల్‌ నిర్మించారు.

 

మూడేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది. తాజాగా ఈ సినిమా మరో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైంలో కూడా ఈ సినిమాను స్ట్రీమింగ్‌కి తీసుకువచ్చింది. కాగా కొత్త రకమైన హారర్‌ ఎలిమెంట్స్‌తో మసూద థియేటర్లలో ఆకట్టుకుంది. ప్రతి క్షణంగా హారర్‌తో ఆడియన్స్‌ భయపెడుతూ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది. కాగా ఇందులో సీనియర్‌ నటి సంగీత, తిరువీర్‌, కావ్య కళ్యాణ్‌రామ్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు.

 

కథేంటంటే

నీలం (సంగీత) ఓ ప్రైవేట్‌ స్కూల్‌ టీజర్‌. భర్త అబ్దుల్‌కు (సత్య ప్రకాశ్‌) దూరంగా ఉంటున్న ఆమె కూతురు నాజియా (బాంధవి శ్రీధర్‌)తో కలిసి ఓ అపార్టులో నివసిస్తుంది. అదే అపార్టుమెంట్‌లో ఉండే గోపీ(తిరువీర్‌) ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తుంటాడు. తన సహా ఉద్యోగి అయిన మినీ (కావ్యా కళ్యాన్‌రామ్‌) ని ప్రేమిస్తుంటాడు. కానీ తన ప్రేమను ఆమె చెప్పేందుకు భయపడుతుంటాడు. నీజానికి గోపీ చాలా భయస్తుడు. ఎదుటివారితో మాట్లాడాలన్నా, తన అభిప్రాయాన్ని చెప్పలన్నా చాలా మొహమాట పడుతుంటాడు. అయితే ఒకే అపార్టుమెంట్‌లో నివసించడం వల్ల నీలం ఆమె కూతురు నాజియాతో క్లోజ్‌గా ఉంటాడు.

 

అప్పుడప్పుడు కూరగాయలు తెచ్చివ్వడం వంటి సాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు నాజియా అర్థరాత్రి వేళ ఏదోదో మాట్లాడుతుంది. కూతురిని అలా చూసి షాకైన ఆమె గోపీ సాయం కోరుతుంది. ఆమెను అలా చూసి దెయ్యం పట్టిందని గ్రహించిన గోపీ తనకు తెలిసి బాబా దగ్గరికి తీసుకువెళతాడు. అలా చివరికి ఓ నాజియాకు పట్టిన దెయ్యం ఏంటీ? దాని కథ తెలుసుకుంటారు. దాని నుంచి నాజియా కాపాడేందుకు చేసే ప్రయత్నం సంగీత, గోపీలకు ఎదురైన సంఘటనలు? సాధారణంగానే భయస్తుడైన గోపీ ఆ దెయ్యాని ఎలా ఎదర్కొన్నాడనేదే మసూద కథ.