Published On:

Ram Charan Peddi Video: రామ్‌ చరణ్‌ ‘పెద్ది’ డైలాగ్‌ వీడియో – సర్‌ప్రైజ్‌ అవుతున్న ఫ్యాన్స్‌, ఏది నిజమో తెలియట్లేదుగా..!

Ram Charan Peddi Video: రామ్‌ చరణ్‌ ‘పెద్ది’ డైలాగ్‌ వీడియో – సర్‌ప్రైజ్‌ అవుతున్న ఫ్యాన్స్‌, ఏది నిజమో తెలియట్లేదుగా..!

Ram Charan Peddi Dialogue AI Video Viral: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్‌ని కన్‌ఫాం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుటుంది. అయితే శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చాడు బుచ్చిబాబు. తొలిషాట్‌ పేరుతో విడుదల చేసిన ఈ గ్లింప్స్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా చివరిలో నేలకు బ్యాట్‌ను కొట్టి బంతిని బాదిన షాట్‌ అభిమానులకు మంచి కిక్‌ ఇచ్చింది.

ఉత్తరాంధ్ర యాసలో అదరగొట్టి ‘పెద్ది’

ఈ గ్లింప్స్‌ వచ్చి రెండు రోజులపైనే అవుతున్న ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇక ఇందులో చరణ్‌ ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్ హైలెట్‌ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ డైలాగ్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. చరణ్‌ స్వయంగా ఈ డైలాగ్‌ చెబుతున్నట్టు ఉన్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తుంది. గ్లింప్స్‌ ప్రారంభంలో చరణ్‌ ఎంట్రీ చూపిస్తూ బ్యాగ్రౌండ్‌లో ఓ డైలాగ్ వచ్చిన సంగతి తెలిసిందే. “ఒకే పని సెసేనాకి.. ఒకే నాగ బతికేనాకి.. ఇంతపెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసెయ్యాల.. పుడతామా యేటి మళ్లీ!” అని రామ్‌ చరణ్‌ స్వయంగా చెబుతున్నట్టు ఉన్న డైలాగ్‌ వీడియో ఒకటి బయటకు వచ్చింది.

వైరల్ గా చరణ్ వీడియో

ఇందులో చరణ్‌ బ్లాక్‌ డ్రెస్‌ ధరించి ఏదో ఇంటర్య్వూలో పాల్గొన్నట్టు ఉంది. అయితే ఇది నిజమా, అబద్దమా అని పట్టి చూడగానే అసలు విషయం తెలిసిందే. ఇది ఏఐ(AI) ద్వారా ఎడిట్‌ చేసిన వీడియో అని తెలిసిందే. కానీ ఇది చూసి మాత్రం మెగా అభిమానులంతా తెగ మురిసిపోతున్నారు. నిజంగానే చరణ్‌ అన్న చెప్పినట్టే ఉందని, లిప్ సింక్‌ కూడా మ్యాచ్‌ అయ్యిందని.. ఎవరు ఎడిట్‌ చేశారో కానీ అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతుంది. దీనిని అభిమానులు వివిధ ప్లాట్‌ఫాంలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

 

కాగా స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ పెద్ది సినిమాలో చరణ్‌ సరసన బాలీవుడ్‌ భామ జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ది సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది మార్చి 27న వరల్డ్‌ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్‌ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.