Published On:

Kalki 2 Release Date: ‘కల్కి 2’ రిలీజ్‌ ఎప్పుడు? – నాగ్‌ అశ్విన్ ఫన్నీ రిప్లై, ఏమన్నారంటే!

Kalki 2 Release Date: ‘కల్కి 2’ రిలీజ్‌ ఎప్పుడు? – నాగ్‌ అశ్విన్ ఫన్నీ రిప్లై, ఏమన్నారంటే!

Nag Ashwin About Kalki 2 Release: పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. మైథలాజికల్‌ సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది విడుదలైన భారీ విజయం సాధించింది. నాగ్‌ అశ్విన్‌ విజన్‌తో కల్కిని విజువల్‌ వండర్‌గా తెరకెక్కించి ఆడియన్స్‌ని కట్టిపేడేశాడు. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ కురిపించిన ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉన్న విషయం తెలిసిందే.

 

ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ని జరుపుకుంటుంది. అయితే తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న నాగ్‌ అశ్విన్‌కి ‘కల్కి 2′ రిలీజ్‌పై ప్రశ్న ఎదురైంది. ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న నాగ్‌ అశ్విన్‌ను కల్కి 2 రిలీజ్‌ ఎప్పుడని ఓ విలేఖరి ప్రశ్రించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన సమాధానం వైరల్‌గా మారింది. ఇంతకి నాగ్‌ అశ్విన్‌ ఏమన్నారంటే.. కల్కిని 3, 4 గ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు విడుదల చేశాను. దాని సీక్వెల్‌ను 7,8 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు రిలీజ్‌ చేస్తా. వేచి ఉండండి’ అని ఫన్నీగా స్పందించాడు. ఇటీవల కూడా ఆయన కల్కి 2పై స్పందించిన సంగతి తెలిసిందే.

 

ప్రస్తుతం కల్కి 2 స్క్రిప్ట్‌ వర్క్‌ జరుపుకుంటుందని, ఈ ఏడాది చివరిలోగా సినిమాను సెట్స్‌పైకి తీసుకుస్తామన్నారు. పార్ట్‌ 2లో ప్రభాస్‌, కమల్‌ హాసన్‌లు ఎక్కువ సేపు ఆన్‌స్క్రీన్‌పై కనిపిస్తారని, ముఖ్యంగా భైరవను.. కర్ణ యాంగిల్‌లో చూపించే కథ ఇది అన్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్‌, దీపికా పదుకొనె, కమల్‌ హాసన్‌, దుల్కర్‌ సల్మాన్‌, రాజేంద్ర ప్రసాద్ వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషించారు.