Last Updated:

Lottery: లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకున్న భర్త.. ఊహించని షాకిచ్చిన భార్య..!

Lottery: కొందరు వ్యక్తులు లాటరీల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్కసారైన తగలదా అని వాటిని కొంటూ ఉంటారు. అలాంటిది ఓ వ్యక్తికి అదృష్టం వరించింది. ఏకంగా రూ. కోట్ల లాటరీ తగిలింది. ఇంత డబ్బు ఒక్కసారిగా రావడంతో.. ఆనందంలో మునిగిపోయాడు.

Lottery: లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకున్న భర్త.. ఊహించని షాకిచ్చిన భార్య..!

Lottery: కొందరు వ్యక్తులు లాటరీల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్కసారైన తగలదా అని వాటిని కొంటూ ఉంటారు. అలాంటిది ఓ వ్యక్తికి అదృష్టం వరించింది. ఏకంగా రూ. కోట్ల లాటరీ తగిలింది. ఇంత డబ్బు ఒక్కసారిగా రావడంతో.. ఆనందంలో మునిగిపోయాడు. కానీ అతడి భార్య మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. లాటరీ గెలుచుకున్న తర్వాత.. విడాకులు కావాలంటూ కోర్టుకెక్కింది. ఈ విచిత్ర ఘటన చైనాలో చోటు చేసుకుంది.

లాటరీ తగిలాక.. కోర్టుకెక్కిన భార్య.. (Lottery)

చైనాకు చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించి భారీ లాటరీ తగిలింది. చైనా కరెన్సీ ప్రకారం.. 10 మిలియన్ యునాన్లు (రూ. 12 కోట్లు) గెలుచుకున్నాడు. ఒక్కసారిగా అంత నగదు చేతికి రావడంతో.. ఆ వ్యక్తి అనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే అతడి భార్య మాత్రం.. అతడికి ఊహించని షాకిచ్చింది. తన భర్త వల్ల అన్యాయం జరిగిందని.. విడాకులు కావాలని కోర్ట్ ని ఆశ్రయించింది. దీంతో పాటు.. లాటరీ డబ్బుతో పాటు.. ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని కోరుతూ కేసు పెట్టింది. కోర్టులో కేసు పెట్టడంతో ఆ భర్తకు దిమ్మతిరిగే షాక్ తగిలింది.

కీలక తీర్పు ఇచ్చిన కోర్టు..

లాటరీ గెలుచుకున్న వ్యక్తి పేరు జోవ్. ఇందులో పన్నులు తీసివేయగా.. అతడికి రూ.10.22 కోట్లు వచ్చాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంత డబ్బు వచ్చిన విషయం ఆ వ్యక్తి భార్యకు తెలియకుండా దాచిపెట్టాడు. ఇందులోంచి కొంత తన సోదరికి ఇవ్వగా… అందులోంచి కొంత నగదుతో మాజీ ప్రేయసీకి మంచి ఫ్లాట్‌ను కొని బహుమతిగా అందించాడు. కొద్ది రోజుల తర్వాత.. ఈ విషయం భార్య లిన్‌కు తెలిశాయి. లాటరీ గెలిచిన తనకు చెప్పలేదని.. ఆమె ఆగ్రహంతో రగిలిపోయింది. తనకు తెలియకుండా.. సోదరికి నగదు ఇవ్వడం.. మాజీ ప్రేయసికి ఫ్లాట్ ఇవ్వడం మరింత కోపాన్ని తెప్పించాయి. ఈ విషయంలో భర్త.. తనకు అన్యాయం చేశాడంటూ ఆరోపించింది. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ.. కోర్టును ఆశ్రయించింది. లాటరీలో గెలుచుకున్న నగదుతో పాటు.. ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని కోరింది.

ఇరువురి వాదనలు విన్న కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రూ. 12 కోట్ల లాటరీ గెలుచుకున్న విషయం చెప్పకపోవడం.. సోదరికి, మాజీ ప్రేయసికి ఫ్లాట్ కొనివ్వడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. లాటరీ టికెట్‌ను ఇద్దరి డబ్బుతోనే కొన్నట్లు కోర్టు తెలిపింది. దీంతో రూ.12.13 కోట్లలో 60 శాతం డబ్బును భార్యకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అతడి మిగతా ఆస్తిని సమానంగా పంచుతున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గతేడాది చైనాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రూ.248 కోట్లు గెలుచుకున్న ఓ వ్యక్తి.. ఆ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. ఈ విషయం చెబితే కుటుంబ సభ్యులు సోమరిపోతుల్లా తయారవుతారని ఇలా చేశాడు.