Home / International News
US Strikes on Yemen 74 Killed: యెమెన్‌పై అగ్రరాజ్యం విరుచుకుపడుతోంది. ఆ దేశంలోని ఎర్ర సముద్రం తీరంలో ఉన్న చమురు పోర్టు లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 74 మంది మృత్యువాత పడగా.. 171 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హౌతీ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో రాస్ ఇసా చమురు పోర్టు ఉంది. […]
Donald Trump Sensational Comments Russia Strike on Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. సుమీ నగరంపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా.. 34 మంది మృతి చెందారు. ఈ దాడిలో 117 మంది క్షతగాత్రులయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించాడు. ఉక్రెయిన్‌పై దాడి భయంకరమైంది అని, ఇలా యుద్ధం చేయడమే ఒక […]
Magnitude 6.4 earthquake strikes Tajikistan: తజికిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 9.54 నిమిషాల వ్యవధిలో భూకంపం వచ్చినట్లు మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. కాగా, భూకంప కేంద్రాన్ని 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. అలాగే, మయన్మార్‌లో ఇవాళ మరోసారి భూకంపం వచ్చింది. మయన్మార్‌లోని మీక్తిలియా నగరానికి సమీపంలో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ తెలిపింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత నమోదైనట్లు […]
Earthquake in Papua New Guinea: పసిఫిక్ దేశంలో మరోసారి భూకంపం సంభవించింది. పపువా న్యూగినియాలో భూప్రకంపనలు సృష్టించడంతో ప్రజలు వణికిపోయారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. కోకోపా నగరానికి సుమారు 115 కిలోమీటర్ల దూరంలో భూకంప తీవ్రత ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఈ భూకంప తీవ్రతకు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భూమి దాదాపు 60సెకన్ల పాటు కంపించినట్లు ఓ రిసార్ట్ నిర్వాహకుడు వివరించాడు. అయితే […]
‘Hands Off’ protesters rally across US to against America President Donald Trump’s Policies: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పదమైన నిర్ణయాలు అమెరికా ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై సుంకం బాదడం మొదలుపెట్టాడు. దీంతో దేశంలో ప్రతి వస్తువు ఖరీదైన వ్యవహహారంగా మారింది. ధరలు మరింత పెరుగుతాయన్న ఆందోళనతో ప్రజలు సూపర్ మార్కెట్లపై పడి ఉన్న వస్తువులను ఖాళీ చేశారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు […]
Donald Trump Announces 26 percent Discounted Reciprocal Tariff On India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రపంచ దేశాలకు తెర పడింది. ఇందులో భాగంగానే ప్రపంచంలోని అనేక దేశాలపై అమెరికా పరస్పర టారిఫ్స్ విధించింది. అన్ని దేశాలు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో వినియోగించుకోవచ్చని, ఇందు కోసం కనీసం 10 శాతం టారిఫ్ చెల్లించాలని ట్రంప్ స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ రోజ్ […]
Earthquake In Myanmar death still 2700 peoples: మయన్మార్‌లో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశాన్ని భూకంపం అతలాకుతలం చేసింది. ఇటీవల వచ్చిన భూకంపం రిక్టార్ స్కేలుపై 7.7 తీవ్రత నమోదైంది. ఈ భారీ భూకంపంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ తర్వాత కూడా భూమి పలుమార్లు కంపించింది. దీంతో దేశంలో ఎటూ చూసిన విధ్వంసమే కనిపిస్తుంది. ఈ ప్రకృతి విలయతాండవం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,700కు చేరింది. ఇప్పటి వరకు […]
Former Pakistan PM Imran Khan nominated for Nobel Peace Prize: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేరు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం ఆయన చేసిన కృషిని గుర్తించి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్లు పాకిస్థాన్ వరల్డ్ అలయన్స్, నార్వేజియన్ రాజకీయ పార్టీ సెంటర్ వెల్లడించాయి. కాగా, పాకిస్థాన్‌లో మానవహక్కులు, ప్రజాస్వామ్యం కోసం ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న కృషిని గుర్తించి నామినేట్ […]
Americans are buying second passports: ప్రపంచంలోని ప్రతి దేశానికి చెందిన పౌరుడు అమెరికాలో స్థిరపడాలని కలలు కంటాడు. అమెరికా పౌరసత్వం లభించిందంటే జన్మధన్యమైందని భావిస్తాడు. మరి అలాంటిది అమెరికా పౌరులే ఇతర దేశాలకు పౌరసత్వం కోసం పోటీ పడుతున్నారు. రెండవ పాస్‌పోర్టు కోసం క్యూ కడుతున్నారు. అమెరికా పౌరసత్వం కోసం పోటీ అంతా ఇంతా కాదని యావత్ ప్రపంచానికి తెలుసు. కొందరు సక్రమ మార్గం ద్వారా వెళితే.. మరి కొందరు అక్రమ మార్గం ద్వారా వెళుతుంటారు. […]
Earthquake Again in Myanmar: మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంప తీవ్రతకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇండియా కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే బర్మా నగరానికి సమీపంలోని నేపై టావ్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించగా.. హూమికి దాదాపు 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉండడంతో భారీ ప్రమాదం […]