Published On:

Pakistan: పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి.. 10 మంది పాక్ సైనికులు హతం

Pakistan: పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరి.. 10 మంది పాక్ సైనికులు హతం

BLA Attack on Pakistan army killed: పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బెలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. బీఎల్ఏ దాడిలో 10 మంది పాకిస్థాన్ సైనికులు హతమయ్యారు. ఈ మేరకు దాడి వీడియోను బెలూచ్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసింది.

 

పాకిస్థాన్ సైనికులే లక్ష్యంగా బలూచిస్థాన్ జరిపిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు. మార్గట్ ప్రాంతంలో ఓ రోడ్డు పక్కన బాంబు అమర్చి రిమోట్ కంట్రోల్ ఆధారంగా పేల్చినట్లు ప్రకటించింది. అనంతరం దీనికి సంబంధించిన ఓ వీడియోను సైతం విడుదల చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

ఇదిలా ఉండగా, పాకిస్థాన్ ప్రభుత్వం బలూచిస్థాన్ ప్రజలను అణిచివేస్తుంది. దీంతో గత కొంతకాలంగా పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్ లిమరేషన్ ఆర్మీ స్వాతంత్య్రం కోరుతోంది. ఇందులో భాగంగానే బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ టార్గెట్ చేసింది. కాగా, గత మార్చిలో బలూచిస్థాన్ లిబరేషన్ చేసిన దాడుల్లో దాదాపు 60 మందికి పైగా హతమయ్యారు. తాజాగా, మరోసారి దాడి చేయడంతో పాకస్థాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

 

అలాగే, బలూచిస్థాన్ ఓ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి దాడులు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించింది. మేమంతా స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. నాశనం కోసం మాత్రం కాదని, శత్రువుల నిర్మూలన లక్ష్యమని వివరించింది.