China Halting Exports to US: చైనా సంచలన నిర్ణయం.. అమెరికాకు కీలక ఎగుమతులు నిలిపివేత..!

China Halting Important Exports to United States: చైనా సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాకు ఎగుమతులను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా చైనా ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరం అయ్యింది. విలువైన ఖనిజాలు, కీలమైన లోహాలు, అయస్కాంతాల ఎగుమతి చేయడం బీజింగ్ నిలిపివేసింది. దీంతో పశ్చిమ దేశాల్లో ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్స్, ఏరోస్పేస్ తయారీ, సెమీకండక్టర్లు కంపెలకు సమస్యలు ఎదురు కానున్నాయి. ఎగుమతులకు సంబంధించిన నిబంధనలను చైనా రూపొందిస్తోంది. అప్పటి వరకూ చైనా పోర్టుల నుంచి మాగ్నెట్‌ల ఎగుమతులను నిలిపివేశారు. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది. నిబంధనలు అమల్లోకి వస్తే కొన్ని కంపెనీలకు శాశ్వతంగా వస్తువుల సరఫరా నిలిచిపోనుంది.
చైనా నుంచి దిగుమతులే కీలకం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధానికి ప్రతి స్పందనగానే కీలక విడిభాగాల ఎగుమతులను చైనా నిలిపివేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న అరుదైన ఖనిజాల్లో 90శాతం చైనా నుంచి వెళ్తున్నాయి. ఈ నెల 2వ తేదీ నుంచి బీజింగ్ వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అప్పటికే చైనా ఉత్పత్తులపై 54 శాతం టారిఫ్‌లను ట్రంఫ్ విధించారు. వీటిని కాకుండా పర్మినెంట్ మాగ్నెట్ల, ఇతర ఉత్పత్తులను కూడా నిలిపి వేసింది. ఈ లోటును భర్తీ చేసుకోవడం అమెరికాకు ఇబ్బందికరంగా మారనుంది. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు మరింత ముదిరితే ఇలాంటి చర్యలు చేపడుతామని బీజింగ్ ఎప్పటి నుంచో హెచ్చరిస్తోంది.
అన్ని దేశాలపై ప్రభావం..
చైనా తాజాగా చేపట్టిన చర్యల ప్రభావం కేవలం అగ్రరాజ్యం అమెరికా వరకే పరిమితం కాదు. అన్ని దేశాలపై పడనుంది. కీలక ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్‌లో చైనా తనకున్న శక్తిని ఆయుధంగా వాడుతోంది. దీంతోపాటు ఎక్స్‌పోర్టు లైసెన్స్‌లను పరిమితం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలోని లాక్‌హీడ్‌మార్టిన్, టెస్లా, యాపిల్ వంటి సంస్థలు చాలా ముడిపదార్థాల కోసం బీజింగ్‌పై ఆధార పడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా సర్కారు వద్ద రేర్‌వర్త్ మినరల్ష్ నిల్వలు ఇప్పటికే ఉన్నాయి. తమ డిఫెన్స్ కాంట్రాక్టర్లకు సరఫరా చేయడానికి ఇవి ఏ మాత్రం సరిపోవు.