Published On:

Pope elections: త్వరలోనే కొత్త పోప్.. ఎలా ఎన్నుకుంటారంటే?

Pope elections: త్వరలోనే కొత్త పోప్.. ఎలా ఎన్నుకుంటారంటే?

Pope Francis Elections: క్యాథలిక్ పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ చర్చిలకు తదుపరి పోప్ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో కొత్త పోప్ రానున్నారు.

 

కాగా, కొత్త పోప్ విషయంలో గత కొంతకాలంగా అత్యంత రహస్యంగా వాటికన్‌లో పోప్ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం క్యాథలిక్ చర్చిలో ఎవరైతే అత్యంత సీనియర్ అధికారులు ఉన్నారో వారందరినీ కలిపి కాలేజ్ ఆఫ్ కార్డినల్స్‌గా పిలుస్తుంటారు. ఈ కార్డినల్స్‌లో అందరూ పురుషులే ఉంటారు. ఇందులో ఉన్న వారినే పోప్‌గా ఎన్నుకుంటారు.

 

పోప్ మరణించిన తర్వాత లేదా రాజీనామా చేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. కార్డినల్స్‌కు మూడింట రెండు వంతుల ఓట్లు వస్తే అర్హత సాధించినట్లు వెల్లడించారు. అలాగే 80 ఏళ్లలోపు ఉన్న కార్డినల్స్ మాత్రమే అర్హులుగా గుర్తించారు. ప్రస్తుతం క్యాథలిక్ చర్చిలో 252 మంది కార్డినల్స్ ఉన్నారు. ఇందులో 114 మంది 80 ఏళ్ల వయసు దాటడంతో కేవలం 138 మంది మాత్రమే కొత్త పోప్‌ను నియమించేందుకు అర్హులుగా ఉన్నారు. వీరికే ఓటు వేసే అధికారం ఉంటుంది.

 

పోప్ ఫ్రాన్సిస్ డెత్ రిపోర్టులో గుండెపోటు వచ్చినట్లు వాటికన్ డాక్టర్ ఆండ్రియా తెలిపారు. అలాగే ఆయన కోమాలోకి కూడా వెళ్లినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, శుక్రవారం లేదా ఆదివారం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఎలాంటి ఆడంబరం లేకుండా మట్టిలో పూడ్చడంతో పాటు ఇన్ స్క్రిప్షన్‌పై తన పేరును లాటిన్ భాషలో రాయాలని ముందుగానే ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.