Published On:

Tajikistan: తజికిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 6.4 తీవ్రత

Tajikistan: తజికిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 6.4 తీవ్రత

Magnitude 6.4 earthquake strikes Tajikistan: తజికిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 9.54 నిమిషాల వ్యవధిలో భూకంపం వచ్చినట్లు మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. కాగా, భూకంప కేంద్రాన్ని 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.

 

అలాగే, మయన్మార్‌లో ఇవాళ మరోసారి భూకంపం వచ్చింది. మయన్మార్‌లోని మీక్తిలియా నగరానికి సమీపంలో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ తెలిపింది. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రత నమోదైనట్లు తెలిపారు.

 

ఇదిలా ఉండగా, మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలు మార్చి 28 వ తేదీన వచ్చిన భూకంప తవ్రతకు అతలాకుతలమైంది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత నమోదు కావడంతో భారీ భవనాలు కుప్పకూలాయి. ఈ భూకంప తీవ్రతకు దాదాపు 3వేల మంది మృతి చెందారు. భారీ ఎత్తున ఆస్తినష్టం కూడా వాటిల్లింది. ఎక్కువ సంఖ్యలో గాయపడగా..కొంతమంది గల్లంతయ్యారు.