Published On:

Flights Cancelled in China: చైనాలో భీకర గాలులు.. 693 విమాన సర్వీసులు రద్దు!

Flights Cancelled in China: చైనాలో భీకర గాలులు..  693 విమాన సర్వీసులు రద్దు!

693 Flights Cancelled due to Heavy Rains in China: చైనాలో భీకర గాలులు వీస్తున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా వందలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. బీజింగ్, డాక్సింగ్‌లలో మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 693 విమాన సర్వీసులు రద్దు చేశారు. అలాగే దుమ్ము తుపానులు చెలరేగే అవకాశం ఉండడంతో పార్కులు సైతం అధికారులు మూసేశారు. గంటపాటు భారీగా గాలులు వీయడంతో బీజింగ్‌లో చెట్లు నేలకొరిగాయి. అలాగే పాత ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడిచారు.

 

ఇదిలా ఉండగా, చైనా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. గాజు వంతెనను భారీ నిర్మాణంతో చేపట్టి ఔరా అనిపించింది. వివరాల్లోకి వెళ్తే.. గుయ్ ఝూ ప్రాంతంలో బీపన్ నదిపై ఓ భారీ లోయపై 2 మైళ్ల పొడవుతో గాజు వంతెనను నిర్మించింది. కాగా, ఇది ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిగా నిలిచే అవకాశం ఉంది. ఈ బ్రిడ్జి నిర్మించడంతో 60 నిమిషాలు పట్టే సమయాన్ని కేవలం ఒక్క నిమిషంలోనే పూర్తి చేయవచ్చు. ఈ బ్రిడ్జిని హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ నిర్మించగా దీనిని 2022లో ప్రారంభించారు. ఈ బ్రిడ్జికి భారత కరెన్సీ ప్రాకరం రూ.2,400కోట్లు ఖర్చు చేశారు.