Published On:

US strikes on Yemen: యమెన్‌పై అమెరికా వైమానిక దాడి.. 74కి పెరిగిన మృతులు

US strikes on Yemen: యమెన్‌పై అమెరికా వైమానిక దాడి.. 74కి పెరిగిన మృతులు

US Strikes on Yemen 74 Killed: యెమెన్‌పై అగ్రరాజ్యం విరుచుకుపడుతోంది. ఆ దేశంలోని ఎర్ర సముద్రం తీరంలో ఉన్న చమురు పోర్టు లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 74 మంది మృత్యువాత పడగా.. 171 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హౌతీ ఆరోగ్య శాఖ తెలిపింది.

 

ఇదిలా ఉండగా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో రాస్ ఇసా చమురు పోర్టు ఉంది. ఈ ఇంధనం అందించే స్థావరాన్ని ధ్వంసం చేసేందుకు అమెరికా దాడులు నిర్వహిస్తోంది. ఎలాగైనా తమ ఆదాయ వనరులను దెబ్బతీయాలనే లక్ష్యంతోనే దాడులు చేస్తున్నట్లు అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. కాగా, ఇప్పటివరకు ఆ దేశంలో పౌరులపై ఎలాంటి హానీ కలిగించలేదని ప్రకటించారు.

 

అంతకుముందు మార్చి 15వ తేదీన హౌతీలపై అమెరికా యుద్ధం ప్రకటించింది. అయితే, ఇవాళ చేపట్టిన వైమానిక దాడి అతిపెద్దదిగా ఆ దేశం తెలిపింది. అయితే మార్చి 17న సైతం హౌతీలపై అమెరికా దేశం దాడులు చేసింది. యెమెన్ దేశంలోని సనా, సదా, హౌతీలోని అల్ బేద్, రాడాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఎర్ర సముద్రంలో చేపట్టిన ఈ వైమానిక దాడుల్లో దాదాపు 31 మంది చనిపోగా.. 100 మందికి పైగా గాయపడ్డారు.

 

అమెరికా చేపట్టిన ఈ వైమానిక దాడులతో ఆ ప్రాంతాల్లో భూకంపం కంపించినట్లు చెప్పారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. హౌతీలను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా దేశ హెచ్చరికలను పట్టించుకోకపోతే బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు.