Published On:

Earthquake in Papua New Guinea: మరోసారి భూకంపం.. వణికిపోతున్న పపువా న్యూ గినియా

Earthquake in Papua New Guinea: మరోసారి భూకంపం.. వణికిపోతున్న పపువా న్యూ గినియా

Earthquake in Papua New Guinea: పసిఫిక్ దేశంలో మరోసారి భూకంపం సంభవించింది. పపువా న్యూగినియాలో భూప్రకంపనలు సృష్టించడంతో ప్రజలు వణికిపోయారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. కోకోపా నగరానికి సుమారు 115 కిలోమీటర్ల దూరంలో భూకంప తీవ్రత ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.

 

ఈ భూకంప తీవ్రతకు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భూమి దాదాపు 60సెకన్ల పాటు కంపించినట్లు ఓ రిసార్ట్ నిర్వాహకుడు వివరించాడు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

 

అయితే, పపువా న్యూ గినియా దేశంలో భూకంపాలు సంభవించడం సర్వసాధారణమేనని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. కానీ ఏమైనా విపత్తు జరిగే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తుగా అప్రమత్తమవుతున్నారు. కాగా, ఇటీవల మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత నమోదైందని తెలపగ.. ఈ భూకంప ధాటికి 3వేల మందికిపైగా మరణించారు.