Published On:

US Vice President: భారత్ చేరుకున్న జేడీ వాన్స్..ప్రధానితో విందు

US Vice President: భారత్ చేరుకున్న జేడీ వాన్స్..ప్రధానితో విందు

US vice president JD Vance in India: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ చేరుకున్నారు. ఈ మేరకు ఉదయం 10 గంటల్ె ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అనంతరం ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగానే రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రత, భౌగోళిక సంబంధాలతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నాయి. కాగా, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్‌లతో కలిసి ఇటలీ నుంచి వచ్చారు. మొత్తం నాలుగు రోజులపాటు భారత్‌లో పర్యటన చేయనున్నారు.

 

ఇదిలా ఉండగా, కృష్ణా జిల్లా సాయిపురంలో ఉషా వాన్స్‌కు కుటుంబ మూలాలు ఉన్నాయి. 1970లో ఉషా వాన్స్ తల్లిదండ్రులు వలస వెళ్లారు. ఇందులో భాగంగానే అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ సతీమణి ఉషా వాన్స్‌కు రైల్వేశాఖ కి అరుదైన కానుకగా మెమోంటో ఇవ్వనున్నారు.ఈ మేరకు ఈ మెమెంటోను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ బహూకరించనున్నారు.

 

అక్కడి నుంచి ఐటీసీ మౌర్య షెరటన్ హోటల్ వద్దకు వెళ్లి అక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం స్వామి నారాయణ్ అక్షర్ ధామ్‌కు చేరుకుంటారు. దర్శనం చేసుకున్న తర్వాత భారతీయ హస్తకళల వస్తువులు విక్రయించే మార్కెట్‌ను సందర్శించున్నారు. ఇక్కడి నుంచి సాయంత్రం 6.30 గంటల సమయంలో లోక్‌కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసంలో వాణిజ్యంపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు.

 

ఈ భేటీలో భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్, కార్యదర్శి విక్రం మిస్రీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాట్రా హాజరుకానున్నారు. ఈ భేటీ ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి జేడీ వాన్స్ దంపతులుతో పాటు అమెరికా అధికారులు పాల్గొంటారు.